వ్వాహ్‌! ఓవ‌ర్సీస్ నుంచి 31 కోట్లు

Last Updated on by

సీఎం భ‌ర‌త్‌ సార్ హ‌వా ఇంటా బ‌య‌టా ఏ రేంజులో సాగుతోందో చెప్పేందుకు ఈ ఎగ్జాంపుల్ చాలు. ముఖ్యంగా ఓవ‌ర్‌సీస్‌లో సీఎం భ‌ర‌త్ వ‌సూళ్లు షాకిస్తున్నాయి. ఓవ‌ర్సీస్‌ని నైజాంగా మార్చుకున్న తెలుగోడి హ‌వా దేశ‌, విదేశాల్లో అజేయంగా కొన‌సాగుతోంద‌ని భ‌ర‌త్ రిపోర్ట్ చెబుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూర‌ప్‌, ఆఫ్రికా, మ‌లేషియా, యూఏఈ ఎందెందు అడుగుపెట్టినా అక్క‌డ భ‌ర‌త్ అనే తెలుగోడి హ‌వా సాగింది.

తాజాగా `భ‌ర‌త్ అనే నేను` ఓవ‌ర్సీస్ వ‌సూళ్ల‌ వివ‌రాల్ని డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధికారికంగా ట్వీట్ చేసింది. `భ‌ర‌త్ అనే నేను` ఓవ‌ర్సీస్ గ్రాస్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఉత్త‌ర అమెరికాలో 3015 కె డాల‌ర్లు వ‌సూలు చేయ‌గా, ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ క‌లుపుకుని 535 కె డాల‌ర్లు వసూలైంది. యూర‌ఫ్ – 350కె డాల‌ర్లు, ఆఫ్రికా- మ‌లేషియా- సింగ‌పూర్‌-ఇత‌ర‌చోట్ల క‌లుపుకుని 150కె డాల‌ర్లు వ‌సూలైంది. జీసీసీ- గ‌ల్ఫ్ దేశాల నుంచి – 600 కె డాల‌ర్లు క‌లెక్ట్ చేసంది. ఓవ‌రాల్‌గా విదేశీ బాక్సాఫీస్ వ‌ద్ద 4.61 మిలియ‌న్ డాల‌ర్లు గ్రాస్ వ‌సూళ్లు సాధించామ‌ని డి.వి.వి సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మొత్తం 31.06 కోట్లకు స‌మానం… అంటే ఈ వ‌సూళ్లు నైజాం మార్కెట్ కంటే చాలా ఎక్కువ‌. తెలుగు సినిమాకి ఇండియ‌న్ డాయాస్పోరా (విదేశాల్లో మ‌నోళ్లు)లో ఆద‌ర‌ణ ఏ స్థాయిలో పెరుగుతోందో తెలిపేందుకు ఇదో ఎగ్జాంపుల్‌.

User Comments