సీఎం భ‌ర‌త్‌కి లోక్‌స‌త్తా స్ఫూర్తి?

Last Updated on by

సీఎం భ‌ర‌త్ ఆశ‌యాల‌కు లోక్‌స‌త్తా పార్టీ స్ఫూర్తినిచ్చిందా? అంటే అవున‌నే స‌మాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాలో కొర‌టాల సూచించిన రెండు పాయింట్ల‌ను లోక్ స‌త్తా అధినేత‌, విద్యాధికుడు అయిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ ఆనాడే సూచించారు. కానీ మంచి చెప్పిన‌వారికి, నీతులు మాట్లాడేవారికి రాజ్యాధికారం క‌ట్ట‌బెట్ట‌మ‌ని ప్ర‌జ‌లే తేల్చి చెప్పారు. అధికారం పోతే పోయింది కానీ, జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్‌ని సంతృప్తి ప‌రిచే ఒకే ఒక్క సినిమా ఇన్నేళ్ల‌లో టాలీవుడ్‌లో వ‌చ్చింది. అదే `భ‌ర‌త్ అనే నేను`. ఈ చిత్రంలో మ‌హేష్ సీఎం భ‌ర‌త్‌గా అద‌ర‌గొట్టాడ‌ని అంతా ప్ర‌శంసిస్తుంటే, ఈయ‌న మాత్రం నా ఆద‌ర్శాల్ని సీఎం పాత్ర‌కు ఆపాదించార‌ని డిక్లేర్ చేశారు. ఆ రెండు పాయింట్లు త‌న‌కు ఎంతో బాగా న‌చ్చేశాయ‌ని లోక్ స‌త్తా అధినేత ఆనందం వ్య‌క్తం చేశారు.

భ‌ర‌త్ సినిమా వీక్షించిన అనంత‌రం లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ ట్వీట్ట‌ర్‌లో ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. “ఫ్యామిలీ, స‌హోద్యోగులు, ఎంద‌రో ఫ్రెండ్స్‌తో క‌లిసి హైద‌రాబాద్‌- ప్ర‌సాద్ లాబ్స్‌లో సినిమా చూశాను. రెండు బ‌ల‌మైన సందేశాల్ని కొర‌టాల తెర‌పై ఆవిష్క‌రించారు. చ‌క్క‌ని మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కించారు. లోక‌ల్ గ‌వ‌ర్న‌మెంట్‌, రూల్ ఆఫ్ లా .. వంటి కీల‌క విష‌యాల‌పై అద్భుతంగా చూపించారు. అధికారం స్థానిక సంస్థ‌ల‌కే ధారాద‌త్తం చేస్తేనే ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లుతుంది. ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంది“ అని అన్నారు. అయితే ఈ రెండు పాయింట్ల‌ను జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ లోక్ స‌త్తా పార్టీ పాల‌సీలో ప్ర‌ధానంగా చేర్చిన సంగ‌తి తెలిసిందే. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇదివ‌ర‌కూ భ‌ర‌త్ సినిమా వీక్షించి మ‌హేష్ న‌ట‌న‌ను, కొర‌టాల ప‌నిత‌నాన్ని ప్ర‌శంసించారు.

Watch Here:

User Comments