భ‌ర‌త్ స‌ర్ త‌ప్పుడు లెక్క‌?

Last Updated on by

సీఎం భ‌ర‌త్ వ‌సూళ్ల గురించి మీకు తెలిసిన నిజం ఎంత‌? 100 కోట్ల క్ల‌బ్‌, 160 కోట్ల క్ల‌బ్‌, 200 కోట్ల క్ల‌బ్ అంటూ పోస్ట‌ర్లు వేశారు కాబ‌ట్టి, ఆ మొత్తం వసూలైంద‌నే మీ లెక్క అయితే అది త‌ప్పు అని చెప్ప‌డానికి కొన్ని ఆధారాలు బ‌య‌ట‌ప‌డ్డాయ్‌. తూ.గో, ప‌.గో జిల్లాల సాక్షిగా, కొంద‌రు బ‌య్య‌ర్లు లీక్ చేసిన అస‌లు లెక్క‌లిలా ఉన్నాయి. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికీ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించ‌లేద‌ని పంపిణీదారులు గ‌గ్గోలు పెడుతున్నారు. నైజాం 22 కోట్ల‌కు కొంటే 17 కోట్లు మాత్రమే వ‌సూలైంది. సీడెడ్ 12కోట్ల‌కు కొంటే 9 కోట్లు మాత్ర‌మే లెక్క తేలింది.
తాజాగా 13 రోజుల వ‌సూళ్ల లెక్క ప‌రిశీలిస్తే… వాస్త‌వం పూర్తి వేరుగా ఉంది. మ‌హేష్‌కి అత్యంత కీల‌క‌మైన‌  నైజాం హ‌క్కులు 22 కోట్ల‌కు కొనుక్కున్నారు. కానీ అక్క‌డ‌ 17 కోట్లతో స‌రిపుచ్చుకుంది. ఫుల్‌ర‌న్‌లో ఇంకెంత వ‌సూల‌వుతుందో చెప్ప‌లేం. అలాగే సీడెడ్ 12కోట్ల‌కు కొంటే 9 కోట్లు ఇప్ప‌టికి చేతికొచ్చింది. నెల్లూరు 3కోట్ల‌కు కొంటే 2.4కోట్ల షేర్ వ‌సూళ్లు తేలాయ‌ని చెబుతున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాకు 6.7కోట్ల‌కు కొంటే 6.35 కోట్ల‌తో సేఫ్ పొజిష‌న్‌కు చేరుకుంది. అయితే  ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పంపిణీదారుకు మాత్రం ఊహించ‌ని రీతిలో అసాధార‌ణ‌మైన పంచ్ ప‌డిందిట‌. అక్క‌డ 3.9కోట్ల‌కు కొనుక్కుంటే ..50 శాతం రిట‌ర్నులు కూడా రాలేదుట‌. ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే  2కోట్లు థియేట‌ర్ల నుంచి లాక్కోవాల్సి ఉంటుందిట‌. గుంటూరు 13 కోట్ల‌కు కొంటే, అక్క‌డ మ‌హేష్ హ‌వా స్ప‌ష్టంగా సాగింది. అది సేఫ్ జోన్‌.  వైజాగ్ 8.2కోట్ల‌కు కొంటే 8కోట్లు వ‌సూలైంది.. మ‌హేష్‌కి వైజాగ్ మార్కెట్ పెద్ద రేంజులో వ‌ర్క‌వుటైంది. ఓవ‌ర్సీస్ 16కోట్ల‌కు కొనుక్కుంటే ఇప్ప‌టికే 3.5 మిలియ‌న్ డాల‌ర్ల‌(22కోట్లు సుమారు) వ‌సూళ్ల‌కు చేరువ‌గా ఉంది. ఇంత‌కీ ఈ సినిమా 100 కోట్ల షేర్ అందుకుందా? అంటే ఇంకా స‌మాధానం లేనేలేదు. ఈ వారంలో చేరుకోవ‌చ్చ‌న్న అంచ‌నాలు వేస్తున్నారు. ఇప్ప‌టికే `నా పేరు సూర్య‌` రిలీజైంది. సూర్య ఛార్జ్ తీసుకున్నాడు కాబ‌ట్టి భ‌ర‌త్ ప‌ప్పులుడుకుతాయా? అంటే చెప్ప‌లేం. ఇప్పుడు చెప్పండి భ‌ర‌త్ సార్ త‌ప్పు చెప్పారా లేదా? త‌ప్పు చేశారా లేదా?  డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత దాన‌య్య స‌ర్‌ని అడ‌గాలేమో?

User Comments