అమెరికాలో 20 కోట్ల‌ క్ల‌బ్‌లో?

Last Updated on by

మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` ఇంటా బ‌య‌టా(దేశ‌విదేశాల్లో) సంచ‌ల‌న వ‌సూళ్ల‌తో అరుదైన రికార్డులు అందుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ నుంచి ఏకంగా 160 కోట్ల వ‌సూళ్లు సాధించి ఇప్పుడు 175 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టేందుకు కూత‌వేటు దూరంలో ఉంది. ఈ సినిమా అమెరికాలోనూ అసాధార‌ణ వ‌సూళ్లు సాధిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇప్ప‌టికి 3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఆ మేర‌కు డివివి సంస్థ అధికారికంగా ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది. 3 మిలియ‌న్ డాల‌ర్లు అంటే సుమారు 20 కోట్లు. ఇక ఈ సినిమా మ‌రో మైలురాయిని ఓవ‌ర్సీస్ బాక్సాఫీస్ వ‌ద్ద అందుకోవాల్సి ఉంటుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ రామ్‌చ‌ర‌ణ్ `రంగ‌స్థ‌లం` 3.5 మిలియ‌న్ డాల‌ర్ల‌తో నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఓవ‌ర్సీస్‌-నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. ఈ రికార్డును చేరాలంటే ఇంకో 0.5 మిల‌య‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయాలి. 3.5- 4 మిలియ‌న్ డాల‌ర్లు భ‌ర‌త్ ఖాతాలో వసూలైతే నాన్ బాహుబ‌లి రికార్డు అందుకున్న‌ట్టే. అయితే అందుకు కూత‌వేటు దూర‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ వ‌సూళ్ల‌ను బ‌న్ని `నా పేరు సూర్య‌` రిలీజ్‌లోపే సాధించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా మే 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత క్రేజీగా రిలీజ‌వుతోంది. అప్ప‌టివ‌ర‌కూ భ‌ర‌త్ హ‌వాకి తిరుగుండ‌దు కానీ ఆ త‌ర‌వాత మాత్రం క‌ష్ట‌మేన‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

User Comments