సీఎం భారత్ విదేశాల్లో ఏంత దొంగిలిచాడంటే!

Last Updated on by

ఓవైపు విమ‌ర్శ‌లు.. మ‌రోవైపు వ‌సూళ్లు .. ఇదీ భ‌ర‌త్ స్టైల్‌. కొన్ని ఏరియాల్లో న‌ష్టం వ‌చ్చింది మొర్రో అని ల‌బోదిబోమంటుంటే, మ‌రోవైపు వ‌సూళ్ల లెక్క‌ల్ని లైవ్‌లో చూపిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఈ లెక్క‌లేంటి సార్ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు కొంద‌రు ట్రేడ్ ఎన‌లిస్టులు. అయితే నేడు రిలీజైన `నా పేరు సూర్య` రిపోర్ట్ ను బ‌ట్టి భ‌ర‌త్‌కు మైలేజ్ పెరిగే ఛాన్సుంద‌న్న మాటా వినిపిస్తోంది. భ‌ర‌త్ వ‌సూళ్ల‌పై ఓవ‌ర్సీస్ నుంచి వ‌చ్చిన‌ తాజా తాజా అప్‌డేట్ ప్ర‌కారం…

తొలి రెండు వారాల్లో సాధించిన గ్రాస్ వ‌సూళ్ల లెక్క‌లు ఇలా ఉన్నాయి. భ‌ర‌త్ అనే నేను చిత్రం ఉత్త‌ర అమెరికా నుంచి 3475కె డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఆస్ట్రేలియా- న్యూజిల్యాండ్ నుంచి 585కె డాల‌ర్లు, యూర‌ప్, బ్రిట‌న్ నుంచి 370 కె డాలర్లు, ఆఫ్రికా, మలేషియా, సింగ‌పూర్ (9రోజులు) నుంచి 195కె డాల‌ర్లు వ‌సూలైంది. గ‌ల్ఫ్ దేశాల నుంచి 665కె డాల‌ర్లు, ఓవ‌రాల్‌గా 5.29కె డాల‌ర్లు (35.39 కోట్లు) లెక్క తేల్చారు. ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ గ్రేట్ ఇండియా ఫిలింస్ ట్విట్ట‌ర్‌లో ఈ వ‌సూళ్ల వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ లెక్క‌ల్ని బ‌ట్టి ఓవ‌ర్సీస్‌లో భ‌ర‌త్ హ‌వా ఓ రేంజులో సాగింద‌ని చెప్పొచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొన్నిచోట్ల బ‌య్య‌ర్ల‌కు రిట‌ర్నులు ఆల‌స్య‌మ‌వుతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి.

User Comments