100 కోట్ల క్ల‌బ్‌లో భ‌ర‌త్‌

Last Updated on by

రెండ్రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్‌.. ఇదేదో స‌ల్మాన్ ఖాన్‌, షారూక్ ఖాన్‌, అమీర్‌ఖాన్ సినిమా అనుకునేరు. లేదూ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా ఏమో అని భ్ర‌మించేరు.. అలాంటిదేం కాదు.. ఇది సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సినిమా. కొర‌టాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ది గ్రేట్‌ `భ‌ర‌త్ అనే నేను` రిజ‌ల్ట్‌. అస‌లు మ‌హేష్‌లాంటి యంగ్ సీఎం తెలుగు రాష్ట్రాల‌కు అవ‌స‌రం అని తెలుగు జ‌నం భావించారా? లేదూ తెలుగు రాష్ట్రాల్లో అవినీతి, బాధ్య‌తారాహిత్యం ఇంత దారుణంగా ఉంద‌ని భావించారా? ఏమో.. మొత్తానికి భ‌ర‌త్ రిజ‌ల్టు మాత్రం సూప‌రు!

డే-1లోనే 50కోట్ల వ‌ర‌ల్డ్‌వైడ్‌ గ్రాస్ వ‌సూలు చేసింద‌ని భ‌ర‌త్ టీమ్ నుంచి రిపోర్ట్ అందింది. క‌ట్ చేస్తే డే2, డే3 మ‌ధ్యాహ్నానికి 100 కోట్ల క్ల‌బ్ పోస్ట‌ర్ రెడీ అవుతోంది. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ 100 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టాం అంటూ ట్విట్ట‌ర్‌లో అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. 100 కోట్ల వ‌ర‌ల్డ్‌వైడ్ గ్రాస్ కేవ‌లం రెండున్న‌ర రోజుల్లోనే ఎలా సాధ్యం?.. వ్వాటే మిరాకిల్‌. భ‌ర‌త్ సునామీ ముందు, తెలుగు సినిమా ఎటాక్ ముందు ఇక ఎవ‌రైనా నిల‌వ‌గ‌ల‌రా? ఇక‌మీద‌ట ఖాన్‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే అస‌లు గేమ్ ముందుంది.. కాస్కో నా త‌డాఖా!!

User Comments