భ‌ర‌త్.. ఇంకా 40 బ్యాలెన్స్ అమ్మా..!

Last Updated on by

వ‌చ్చీ రావ‌డంతోనే బాక్సాఫీస్ కు వ‌ణుకు పుట్టించాడు భ‌ర‌త్. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే 100 కోట్ల‌కు పైగా గ్రాస్.. 60 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. మ‌హేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇదే. ఇప్ప‌టికే దూకుడు ఫుల్ టైమ్ క‌లెక్ష‌న్ల‌ను దాటేసింది ఈ చిత్రం. ఇక శ్రీ‌మంతుడు తొలి వారంలో సాధించిన 57 కోట్ల షేర్ ను.. మూడు రోజుల్లోనే దాటేసాడు భ‌ర‌త్. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా 64 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల షేర్.. ఓవ‌ర్సీస్ లో 14 కోట్లు.. క‌ర్ణాట‌క‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లో 7 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసింది భ‌ర‌త్ అనే నేను.

ముఖ్యంగా త‌మిళ‌నాడులో అయితే మూడు రోజుల్లోనే 2 కోట్ల 40 ల‌క్ష‌ల గ్రాస్.. 80 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. తెలుగు సినిమాల్లో ఇది కొత్త రికార్డ్. ఈ చిత్రం సేఫ్ జోన్ కు రావాలంటే 100 కోట్లు వ‌సూలు చేయాలి. ఇప్ప‌టికే 64 కోట్లు రావ‌డంతో మ‌రో 36 కోట్ల కోసం యుద్ధం చేస్తున్నాడు మ‌హేష్. ఇదే వారంలో ఇది కూడా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు మ‌హేష్ బాబు. ఇదే గ‌న‌క వ‌స్తే తెలుగులో మూడో వంద కోట్ల సినిమాగా చ‌రిత్ర సృష్టిస్తాడు మ‌హేష్. ఇప్ప‌టి వ‌ర‌కు ఖైదీ.. రంగ‌స్థ‌లం మాత్ర‌మే 100 కోట్ల షేర్ వ‌సూలు చేసాయి.

User Comments