ఈ ఫేక్ క‌లెక్ష‌న్ల గోలేంట్రా బాబూ..!

టాలీవుడ్ లో ట్రెండ్ మారితే బాగానే ఉంటుంది. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి.. లేదంటే వెన‌క‌బ‌డిపోతాం. కానీ మార్పు అంటే మంచిగా ఉండాలి కానీ ముంచేదిలా కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో రెండోదే జ‌రుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు క‌లెక్ష‌న్లు చెబితే కొద్దోగొప్పో న‌మ్మేట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. వ‌చ్చింది 10 అయితే చెప్పేది 50. ఇప్పుడిదే జ‌రుగుతుంది. లేక‌పోతే మ‌రేంటి..? ఫేక్ క‌లెక్ష‌న్ల‌తో ఇప్పుడు చ‌చ్చే చావు వ‌చ్చింది ఇండ‌స్ట్రీకి. బాగా ఆడుతున్న సినిమాలకు కూడా గొప్ప‌ల‌కు పోయి అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. మొన్న భ‌ర‌త్ అనే నేను విష‌యంలో జ‌రిగింది ఇదే. నిర్మాత అత్యుత్సాహానికి పోయి వారంలోనే 161 కోట్ల గ్రాస్ వ‌చ్చిందంటూ వేసుకున్నాడు. కానీ విమ‌ర్శ‌ల‌కు త‌ట్టుకోలేక 125 కోట్ల పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు. ఇక ఇప్పుడు రెండు వారాల‌కు 190 కోట్ల గ్రాస్ వ‌సూలు అయిందంటూ కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసాడు నిర్మాత దాన‌య్య‌.Bharath Ane Nenu Naa Peru Surya Fake Collections Postersఈయ‌న ఇంటెన్ష‌న్ మొత్తం భ‌ర‌త్ అనే నేనును 200 కోట్లు దాటించ‌డ‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తుంది. నా పేరు సూర్య రెండు రోజుల్లోనే 63 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిందని పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ఓ వైపు సినిమాకు టాక్ యావ‌రేజ్ గా ఉంది.. తొలిరోజు ఊహించిన క‌లెక్ష‌న్లు రాలేదు.. ఓవ‌ర్సీస్ లో అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మిలియ‌న్ మార్క్ కూడా దాట‌లేదు. కానీ అప్పుడే రెండు రోజుల్లోనే త‌మ సినిమా 63 కోట్లు వ‌సూలు చేసిందంటూ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు నిర్మాత‌లు. ఇది నిజంగానే ఇప్పుడు అంద‌రికీ షాక్ ఇస్తుంది. సినిమాకు వ‌సూళ్లు బాగానే వ‌స్తున్నాయి కానీ నిర్మాత‌లు చెబుతున్నంత మాత్రం కాదు. అన‌వ‌స‌రపు హంగుల‌కు పోయి వ‌స్తున్న నిజ‌మైన వ‌సూళ్ల‌ను కూడా ఫేక్ అనుకునే స్థాయికి దిగ‌జారిపోతుంది మ‌న ఇండ‌స్ట్రీ. 63 కోట్లు గ్రాస్ అంటే.. షేర్ 40 కోట్ల వ‌ర‌కు రావాలి. అంత వ‌చ్చిందా అంటే స‌మాధానం లేద‌నే వ‌స్తుంది. మ‌రి ఎందుకు ఈ హంగామా అనేది వాళ్ల‌కే తెలియాలిక‌..!Bharath Ane Nenu Naa Peru Surya Fake Collections PostersBharath Ane Nenu Naa Peru Surya Fake Collections Posters