రాజు గారి దయ వల్ల తప్పిన ప్రమాదం

Last Updated on by

ఇండ‌స్ట్రీలో దిల్ రాజును మించిన నిర్మాత లేడంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు మ‌రోసారి నిరూపించాడు ఇదే విష‌యాన్ని. ఇష్యూ ఏదైనా ఆయ‌న ఎంట్రీ కానంత వ‌ర‌కే కామెడీ.. ఒక్క‌సారి ఆయ‌న వ‌స్తే అంతా సీరియ‌స్సే. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఓ వైపు మ‌హేష్.. మ‌రోవైపు బ‌న్నీ నువ్వా నేనా అన్న‌ట్లుగా ఒకేరోజు రావ‌డానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఏప్రిల్ 26ని త‌మ అడ్డాగా మార్చుకున్నారు కానీ ఇప్పుడు రాజుగారు ఎంట‌ర్ అయిన త‌ర్వాత సీన్ పేప‌ర్ అంతా మారిపోయింది. ఎవ‌రి డైలాగులు వాళ్లు తీసుకుని.. వేర్వేరు సీన్స్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు సింపుల్ గా ఇద్ద‌రు హీరోలు త‌మ రిలీజ్ డేట్స్ మార్చేసుకుని కొత్త తేదీల వైపు ప‌రుగులు తీసారు. భ‌ర‌త్ అనే నేను కాస్తా ముందుకొచ్చింది. ఇక నా పేరు సూర్య ఓ వారం వెన‌క్కి వెళ్లింది. ఈ రెండు సినిమాల మ‌ధ్య ర‌జినీకాంత్ హాయిగా ఉన్నాడు.
Bharath Ane Nenu Naa Peru Surya producers compromisedఏప్రిల్ 20నే భ‌ర‌త్ అనే నేను వ‌స్తుంటే.. మే 4న నా పేరు సూర్య రానుంది. ఇక ఏప్రిల్ 27న కాలా రానున్నాడు. అస‌లు దిల్ రాజు ఇంత చొర‌వ తీసుకుని ఈ రెండు సినిమాల‌ను దూరం చేయ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈయ‌న భ‌ర‌త్ అనే నేను నైజాం రైట్స్ ను 20 కోట్ల‌కు పైగానే పెట్టి కొన్నాడు. ఇక నా పేరు సూర్య రైట్స్ తీసుకున్న వాళ్లు కూడా రాజు గారికి కావాల్సిన వాళ్లే. దాంతో రెండూ ఒకేరోజు వ‌స్తే ఖచ్చితంగా న‌ష్ట‌పోతాను అని తెలుసుకున్న దిల్ రాజు.. నిర్మాతల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చాడు. ఒకే రోజు వ‌స్తే ఎంత తిప్ప‌లు ఉంటాయో వివ‌రంగా చెప్పాడు. దాంతో ఇటు దాన‌య్య‌.. అటు ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్ ఇద్ద‌రూ కాంప్ర‌మైజ్ అయ్యారు. త‌మ సినిమాల‌ను ముందుకు వెన‌క్కి జ‌రుపుకున్నారు. దాంతో క‌థ సుఖాంతం అయిపోయింది. ఇప్పుడు ఇంక ఎవ‌రు ఎప్పుడు వ‌చ్చినా ప్రాబ్ల‌మ్ లేదు. ఎందుకంటే అంతా స్టార్ హీరోలే కాబ‌ట్టి ఖచ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ఉండ‌దు. ఓపెనింగ్స్ తోనే అంతా కుమ్మేసుకుంటారు.

User Comments