వీడియో: భ‌ర‌త్ అసెంబ్లీ మేకింగ్‌

Last Updated on by

మ‌హేష్ – కొర‌టాల క‌ల‌యిక‌లో `భ‌ర‌త్ అనే నేను` సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రెండో వారంలోనే 175కోట్ల నుంచి 200 కోట్లు వ‌సూలు చేసే అవ‌కాశం ఉంద‌ని అంచనా వేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే చిత్ర‌యూనిట్ స‌క్సెస్‌మీట్‌ల‌తో హోరెత్తించేస్తోంది. ఇంత‌టి స‌క్సెస్‌కి మ‌హేష్ న‌ట‌న‌తో పాటు, ఈ సినిమాలో అసెంబ్లీ సీన్స్‌కి అంతే ప్రాధాన్య‌తా ఉంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ఆ అసెంబ్లీని ఎలా డిజైన్ చేశారు? అచ్చం ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీని త‌ల‌పించేలా ఈ సెట్‌ని డిజైన్ చేయ‌డం వెన‌క ఎవ‌రి కృషి దాగి ఉంది? అంటే ఇదిగో ఇదే స‌మాధానం.
తాజాగా డివివి సంస్థ అసెంబ్లీ సెట్ మేకింగ్ విజువ‌ల్స్‌ని ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది. ఈ సెట్ డిజైన్ వెన‌క క‌ళాద‌ర్శ‌కులు, సెట్ వ‌ర్క‌ర్ల ప‌నిత‌నంతో పాటు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ప‌నిత‌నం ఎంతో ఉంద‌ని ఈ మేకింగ్ వీడియో చూశాక‌ అర్థ‌మైంది. భ‌ర‌త్ చిత్రానికి సురేష్ సెల్వ‌రాజ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేశారు. సెల్వ దిశానిర్ధేశ‌నంలోనే భారీ అసెంబ్లీ సెట్‌ని డిజైన్ చేశారు. నిజ‌మైన అసెంబ్లీ, అందులో ఎమ్మెల్యేలు ఉంటే ఎలా ఉంటుందో అలానే కొర‌టాల ఆయా స‌న్నివేశాల్ని అంతే అందంగా తెర‌కెక్కించడంలో స‌క్సెస‌య్యారు. మొత్తానికి ఈ మేకింగ్ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

User Comments