వీడియో: వ‌సుమ‌తి ఆగ‌యారే

Last Updated on by

`భ‌ర‌త్ అనే నేను` సంచ‌ల‌నాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. 90 కోట్ల మేర షేర్ వ‌సూళ్ల‌తో మెజారిటీ పార్ట్‌ పంపిణీదారుల్ని ఒడ్డుకు తెచ్చింది. భ‌ర‌త్ ఫ‌లితం ఇటు మ‌హేష్‌లో, అటు డివివి దాన‌య్య‌లో కొత్త ఉత్సాహం నింపింది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమాకి సీక్వెల్ తీయాల‌న్న కుతూహాలం డి.వి.వి. సంస్థ‌లో మొదలైంద‌ని ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది. మ‌రోసారి సూప‌ర్‌స్టార్ కాల్షీట్లను గుత్త‌గా కొనేసేందుకు దాన‌య్య సిద్ధంగా ఉన్నార‌ట‌.

అదంతా స‌రే.. ఇప్ప‌టికీ `భ‌ర‌త్ అనే నేను` కొన్ని థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోందన్న స‌మాచారం ఉంది. మ‌హేష్ అభిమానులు 100 రోజుల పోస్ట‌ర్ ప‌డే వ‌ర‌కూ ఆడించ‌బోతున్నార‌న్న వివ‌రం అందింది. తాజాగా భ‌ర‌త్ సినిమా నుంచి `ఓ వ‌సుమ‌తి..` సాంగ్‌ని డివివి మీడియా ట్విట్ట‌ర్‌లో రిలీజ్ చేసింది. ఈ పూర్తి వీడియో సాంగ్ మ‌హేష్ ఫ్యాన్స్‌కి పండ‌గ తెచ్చింద‌నే చెప్పాలి. ఒక్క స‌క్సెస్ వంద ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం అన్న చందంగా ఈ చిత్ర క‌థానాయిక కైరా అద్వాణీ పేరు ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మార్మోగిపోతోంది. ఇప్ప‌టికే కైరా… రామ్‌ చ‌ర‌ణ్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తోంది. మ‌రిన్ని సినిమాల‌కు సంత‌కాలు చేసేందుకు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది.

User Comments