ఆ హీరోయిన్ వంద కిలోలు ఉండేది..!

Last Updated on by

తొలి సినిమాలో 100 కేజీలు బ‌రువు ఉంది. అమ్మాయి వ‌య‌సులోనే ఆంటీ అయిపోయింది. చూసిన వాళ్లంతా ఈమె హీరోయిన్ ఎలా అయింద‌బ్బా అనుకున్నారు. వెక్కిరించారు కూడా. కానీ క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా త‌న‌ను తాను మార్చేసుకుంది. ఆ ముద్దుగుమ్మ పేరు భూమి ప‌డ్నేక‌ర్.. బాలీవుడ్ లో ఈ పేరు బాగానే పాపుల‌ర్. ద‌మ్ ల‌గాకే ఐసా అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది భూమి. అప్పుడు ఈమె బ‌రువు 100 కేజీల పైనే. ఆ త‌ర్వాత క‌ష్ట‌ప‌డి త‌గ్గింది. గ‌తేడాది అక్ష‌య్ కుమార్ టాయ్ లెట్ సినిమాలో న‌టించింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో భూమి ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు అమ్మాయిగారు పిచ్చ గ్లామ‌రస్ గా మారిపోయారు.

Bhumi Pednekar Awesome transformation

ఈమె తొలి సినిమా చూసిన‌వాళ్ల‌కు అస‌లు ఈ అమ్మాయిలో ఇంత మార్పేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డమే కాదు.. సూప‌ర్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది భూమి ప‌డ్నేక‌ర్. ఈ మ‌ధ్యే త‌న తొలి చిత్ర హీరో ఆయుష్మాన్ ఖురానాతో క‌లిసి శుభ్ మంగ‌ళ్ సావ‌ధాన్ సినిమాలో న‌టించింది. ఇది కూడా బాగానే ఆడ‌టంతో ఇప్పుడు భూమి కోసం బాగానే ఆరాట ప‌డుతున్నారు ద‌ర్శ‌కులు. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొడుతుంది భూమి. తాజాగా ఓ ఫోటోషూట్ లో అమ్మాయిగారు చేసిన ర‌చ్చ‌కు కుర్రాళ్ళ నిద్రలు చెడిపోతున్నాయి.

Bhumi Pednekar Awesome transformation

User Comments