ఉయ్ డోంట్ కేర్ అంటూ బిగ్ బాస్ క‌మింగ్

ఒక ప‌క్క బిగ్ బాస్-3 వివాదాల‌తో అట్టుడికిపోతుంది. కేసుల మీద కేసులు..ఆందోళ‌న మీద ఆంద‌ళ‌న‌లు. కోర్టులో కేసు విచార‌ణ లో ఉంది. కో ఆర్డినేట‌ల తీరుపై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. పంచాయితీ ఢీల్లీ హెచ్ ఆర్సీకి వెళ్లింది. దీంతో నేడు షో ప్ర‌సారం అవుతుందా? లేదా? అని సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. అయినా ఉయ్ డోంట్ కేర్ అంటూ బిగ్ బాస్ వ‌చ్చేస్తున్నాడు. ఈరోజు రాత్రి తొమ్మిది గంట‌ల‌కు బాస్ వ‌చ్చేస్తున్నాడ‌ని అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నారు.

కొద్దిసేప‌టి క్రిత‌మే ట్విట్టర్లో బిగ్ బాస్ 3 ప్రోమోని పోస్ట్ చేసారు. ప్రసారం లాంఛనమే అని షురూ చేసారు. ఆ ప్రోమోలో నేడు షో ప్రారంభం అని రివీల్ చేసారు. దీంతో ఆందోళ‌న‌ల ప్ర‌భావం బిగ్ బాస్ పై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. మొత్తం 15 మందితో 100 రోజులు షో జ‌ర‌గ‌నుంది. నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఈనెల‌లోనే హై కోర్టులో కేసు హియ‌రింగ్ కు రానుంది. తీర్పు ఆరోజు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో కోర్టు తీర్పును బ‌ట్టి బిగ్ బాస్ త‌దుప‌రి కార్య‌క‌చ‌రణ ఉండ‌నుంద‌ని తెల‌స్తోంది.