బిగ్ బాస్ భామ లాంచింగ్ లు షురూ

బిగ్ బాస్ సీజ‌న్ -3 తో వెలుగు లోకి వ‌చ్చింది హిమ‌జ‌. న‌టిగా చిన్న పాటి పాత్ర‌లతో అమ్మ‌డు ఇప్ప‌టికే సుప‌రిచితం అయిన‌ప్ప‌టి కీ బిగ్ బాస్ ఇమేజ్ మ‌రింత గుర్తింపును తెచ్చి పెట్టింది. దాదాపు 14 సినిమాల్లో న‌టించిన అమ్మ‌డు చివ‌రి సారిగా చిత్ర‌ల హ‌రిలో మంచి పాత్ర తో మెప్పించింది. ప్ర‌స్తుంతం చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. తాజాగా అమ్మ‌డు షాప్ ఓపెనింగ్ ల రేంజ్ కు చేరుకుంద‌ని తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది. ఆదివారం విశాఖ‌ప‌ట్ట‌ణంలోని సంప‌త్ వినాయ‌క టెంపుల్ రోడ్డులో షిమి వోగ్ మొద‌టి అవుట్‌లెట్‌ను సినీ హిమ‌జ ఆదివారం ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా అమ్మ‌డు స్టోర్స్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు వినియోగించుకునే విధంగా ఉంద‌న్నారు. అన్ని ర‌కాల వ‌స్తువులు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే ల‌భించనున్నాయ‌ని తెలిపారు. ఇటువంటి స్టోర్లు రాష్ర్టంలో మ‌రిన్ని ఏర్పాటు కావాల‌న్నారు. అనంత‌రం షిమి వోగ్ స్టోర్ (వైజాగ్) అధినేత కందుల న‌వీన్‌కుమార్ మాట్లాడుతూ ఈ అవుట్‌లెట్‌లో కాస్మోటిక్స్, ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్యాష‌న్ వ‌స్తువులు, గృహోప‌క‌ర‌ణాలు, పిల్ల‌ల బొమ్మ‌లు, నిత్యావ‌స‌ర వ‌స్తువులు, వింట‌ర్ వేర్‌, స‌మ్మ‌ర్ వేర్‌, అన్ని సీజ‌న‌ల్ వేర‌బుల్ థింగ్స్‌, పాద‌ర‌క్ష‌లు, గిఫ్ట్ ఐటెమ్‌లు, త‌దిత‌ర ఉత్ప‌త్తులు వినియోగ‌దారులకు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.

ఈ అవుట్‌లెట్‌లో వినియోగ‌దారులు అత్యున్న‌త‌మైన భారీ ఆఫ‌ర్ల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌న్నారు. 2015 లో ప్రారంభించ‌బ‌డిన కొరియాకు చెందిన షిమి వోగ్ డిజైన‌ర్ బ్రాండ్ మాల్స్ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో అత్యున్న‌త ప్ర‌మాణాలు క‌లిగి ఉంద‌న్నారు. ఈ స్టోర్‌లో రూ.75 నుంచి రూ.1500 విలువ క‌లిగిన ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, కెన‌డా, ర‌ష్యా, సింగ‌పూర్‌, స్పెయిన్‌, యూఏఈ త‌దిత‌ర 77 ప్రాంతాల్లో దీని అవుట్‌లెట్లు ఉన్నాయ‌ని తెలిపారు. ఇండియాలో 70కిపైగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1700 పైగా అవుట్‌లెట్లు ఉన్నాయ‌న్నారు.