టీడీపీలోకి బిగ్ బాస్ విన్న‌ర్ కౌశ‌ల్

Last Updated on by

వైకాపాలో కి పేరున్న సెల‌బ్రిటీలు చేరుతుంటే టీడీపీలోకి చిన్న‌పాటి సెల‌బ్రిటీలు చేరుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే క‌మెడియ‌న్ అలీ సైకిల్ ఎక్కాడు. గుంటూరు నుంచి ఎంపీగా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ -2 విజేత కౌశ‌ల్ కూడా టీడీపీ కండువా క‌ప్పేసాడు. శుక్ర‌వారం అర్ధ‌రాత్రి మంత్రి  గంటా శ్రీనివాస‌రావును వెంట పెట్టుకుని వెళ్లి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి క‌లిసాడు. బాబుతో కౌశ‌లో భేటి దాదాపు గంట‌కు పైగా జ‌రిగింది. తెలుగు దేశం పార్టీతో క‌లిసి ప‌నిచేయాడ‌నికి సిద్దంగా  ఉన్న‌ట్లు కౌశ‌ల్ వెల్ల‌డించాడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో చురుకుగా  పాల్గొంటాన‌ని టీడీపీ గెలుపుకు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తాన‌ని బాబుకు మాటిచ్చిన‌ట్లు తెలుస్తోంది.

అయితే గ‌తంలో పార్టీ త‌రుపునే కౌశ‌ల్ ఎంపీగా బ‌రిలోకి దిగుతాడ‌ని ప్ర‌చారం సాగింది. మ‌రి అంత క్యాప‌బులిటీ కౌశ‌ల్ కు ఉందా? అన్న దానిపై విశ్లేష‌ణ‌లు భిన్నంగా వినిపిస్తున్నాయి. కౌశ‌ల్ కేవ‌లం బిగ్ బాస్ తోనే అంద‌రికీ ప‌రిచ‌యం అయ్యాడు. సీరియ‌ల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఏవో కొన్ని సినిమాల్లో న‌టించాడు త‌ప్ప‌! న‌టుడిగా పెద్ద‌స్టార్ కాదు. ఆ విధంగా జ‌నాల్లో ఫోక‌స్ కాలేదు. ఇటీవ‌లే కౌశ‌ల్ ఆర్మీ తో ప్రేక్ష‌కుల‌ను మోసం చేసాడ‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీలో చేర‌డం పై కొన్ని విమ‌ర్శ‌లు కూడా పోటెత్తే అవ‌కాశం లేక‌పోలేదు.