బిగ్ బాస్ 3 విజేత సీక్రెట్ లీక్

Bigg Boss Telugu 3 Winner

బిగ్ బాస్ సీజ‌న్ 3 రంజుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా స్టార్ మా వేసిన ఎత్తుగ‌డ పారింది. కొన్ని ఎపిసోడ్లలో బిగ్ బాస్ టాస్క్ లు నీర‌సంగా సాగినా, బోర్ కొట్టించినా టీఆర్పీ గుంజ‌డంలో స్థిరంగా ఉండ‌డంతో ఈ షో ఆద‌ర‌ణ‌పై న‌మ్మ‌కం పెరిగింది. ప్ర‌స్తుతం బిగ్ బాస్ ఫైన‌ల్ స్టేజ్ కి చేరుకుంది. ఈ ఆదివారంతో ఫ‌లితం తేల‌నుంది. విజేత ఎవ‌రో ప్ర‌క‌టించేందుకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు సిద్ధ‌మ‌వుతున్నారు.

ప్ర‌స్తుతం ఇంటిలో ఐదుగురున్నారు. వ‌రుణ్ సందేశ్, శ్రీ‌ముఖి, అలీ ర‌జా, రాహుల్ వీళ్ల‌తో పాటు బాబా బాస్క‌ర్ మాస్ట‌ర్ ఉన్నారు. అయితే ఐదుగురిలో విజేత ఎవ‌రు? అన్న‌ది తేలాల్సి ఉంది. ఈ ఫైన‌లిస్టుల నుంచి ఒక‌రిని విజేత‌గా ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే ఆ విజేత ఎవ‌రు? అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. అభిమానుల్లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓటింగ్ ఎవ‌రికి బెట‌ర్ గా ఉంటే వాళ్లు విజేత‌గా నిలిచే అవ‌కాశం ఉంది. ఎవ‌రికి ఎక్కువ ఓట్లు ప‌డితే వాళ్ల‌కు గెలిచే ఛాన్స్ ఉంది. ఇన్నాళ్లు నామినేష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి జ‌నం ఓటేశారు. ఈసారి విజేత‌ను ఎంచుకునేందుకు ఓటేస్తారు. అందువ‌ల్ల ఆ ఐదుగిరిలో ఎవ‌రిని ఫైన‌ల్ చేశారు? అన్న‌ది తేలాల్సి ఉంది. అభిమానుల్లో మాత్రం బిగ్ బాస్ 3 విజేత‌గా శ్రీ‌ముఖిని ఫేవ‌రెట్ గా భావిస్తున్నారు. కొంద‌రు బాబా మాస్టార్ ని మ‌రికొంద‌రు వ‌రుణ్ సందేశ్ ని అనుకుంటున్నారు. అలీ, రాహుల్ కి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఓటింగ్ స‌పోర్ట్ ఉంది. ఎవ‌రికి ఉండాల్సిన ఫ్యాన్స్ వాళ్ల‌కు ఉండ‌డంతో ఎవ‌రు విజేత అన్న క్లారిటీ లేదు. అయితే మెజారిటీ సోష‌ల్ మీడియా శ్రీ‌ముఖి లేదా రాహుల్ ని ఫేవ‌రెట్లుగా భావిస్తున్నార‌న్న చ‌ర్చా ఉంది. మ‌రి ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు? అన్న‌ది చూడాలి. స్ట్రాంగ్ కంటెస్టెంటుగా శ్రీ‌ముఖి పై బ్యూటీ విత్ బ్రెయిన్! అంటూ పొగిడేసే ఫ్యాన్స్ ఉన్నారు.  తెలివితేట‌లు గ్లామ‌ర్ త‌న‌ని విన్న‌ర్ గా నిలుపుతాయా? అన్న‌ది చూడాల్సి ఉంది.