హ‌రీష్ శంక‌ర్‌కి బిగ్ జోల్ట్‌

Last Updated on by

మెగా డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్‌కి బిగ్ జోల్ట్ త‌గిలిందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. వాస్త‌వానికి గ‌త కొంత‌కాలంగా హ‌రీష్‌కి బ్యాడ్ టైమ్ ర‌న్ అవుతోంది. అనుకున్న‌ది ఏదీ వెంట‌నే అవ్వ‌డం లేదు. ఇదివ‌ర‌కూ ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను రెడీ చేసుకుని నిర్మాత దిల్‌రాజు వ‌ద్ద ఓకే చేయించుకున్నా.. ఈ సినిమాకి హీరోలు సెట్ కాక‌పోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. హ‌రీష్‌పై సాఫ్ట్ కార్న‌ర్ ఉన్న నితిన్ ఈ చిత్రంలో న‌టించేందుకు అంగీక‌రించినా.. వేరే హీరో పాత్ర‌కు ఇత‌ర హీరోల్ని సంప్ర‌దిస్తే ఎవ‌రూ క‌న్ఫామ్ కాక‌పోవ‌డంపైనా చ‌ర్చ సాగింది.

ఇదిలా ఉండ‌గానే హ‌రీష్‌కి మ‌రో జోల్ట్ త‌గిలింది. త‌న సినిమా చేస్తాడు అనుకున్న‌ నితిన్ మ‌రో కొత్త ద‌ర్శ‌కుడికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. `ఛ‌లో `ఫేం వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి `భీష్మ` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. `శ్రీ‌నివాస క‌ళ్యాణం` త‌ర్వాత నితిన్ న‌టించే సినిమా ఇదేన‌ని చెబుతున్నారు. ఆగ‌స్టులో ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రంలో నితిన్ స‌ర‌స‌న అందాల మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగ‌స్టు 9న శ్రీ‌నివాస‌క‌ళ్యాణం రిలీజవుతోంది కాబ‌ట్టి ఇక కొత్త సినిమాకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌న్న‌మాట‌. ఇటీవ‌లే `మై ఫ‌స్ట్ షో` ఓ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో అడిగిన ప్ర‌శ్న‌కు హ‌రీష్ స్పందిస్తూ ఇంకా ప్రాజెక్ట్ క‌న్ఫామ్ కాలేద‌ని అన్నారు. దీన్ని బ‌ట్టి చివ‌రికి హీరోల ద‌గ్గ‌రే వ్య‌వ‌హారం సెట్ కాలేద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

User Comments