అమెరికాలో బావ‌ల స‌య్య‌

Last Updated on by

బావ‌ల స‌య్య .. మ‌ర‌ద‌ల స‌య్య‌
బావ‌ల స‌య్య .. మ‌ర‌ద‌ల స‌య్య‌
బావ‌ల స‌య్య .. మ‌ర‌ద‌ల స‌య్య‌
రింబోల రింబోల రింబోల‌..
రింబోల రింబోల రింబోల‌..

ప్ర‌స్తుతం చికాగోలో చిక్కుకున్న బావ‌ల ప‌రిస్థితి ఇదీ. అయితే ఈ స‌న్నివేశంలో సిల్క్ స్థానంలో అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ బ్యూరో పోలీసులు చాకిరేవెట్టేస్తున్నారు. పెద్ద పెద్దోళ్ల‌కే తోలు ఒలిచి దండెంపై ఆరేస్తున్నారు. అయితే ఈ ఆర‌వేత‌లో కొన్ని సొర‌చేప‌ల పేర్లు బ‌య‌ట‌కొచ్చే స‌న్నివేశం క‌నిపిస్తోంది. పొందు, విందు దొరికింది క‌దా! అని ఎగేసుకుని ఎళ్లిపోతే ఏటైతాది బావ‌లూ? అన్న చందంగానే ఈ సెక్స్ రాకెట్ వ్య‌వ‌హారం కొంప కొల్లేరు చేసేస్తోందిట‌. క‌థానాయిక‌లు, యాంక‌ర్లే కాదు, ఏకంగా మంత్రులు, ఎంపీలు.. వీళ్ల‌ వియ్యంకులు ఉన్నార‌ట‌. ప్ర‌స్తుతం బ‌డాబాబుల గుండెల్లో గుబులుగుబులుగా ఉంద‌ని, కంటిపై కునుకుప‌ట్ట‌డం లేద‌ని చెబుతున్నారు. మ‌న ఇండియ‌న్ పోలీసుల్ని మ్యానేజ్ చేసేసిన‌ట్టు అమెరిక‌న్ పోలీసుల్ని మ్యానేజ్ చేయ‌డం కుద‌ర‌దు కాబ‌ట్టి విదేశం సాక్షిగా స్వదేశంలోనూ ప‌రువు గంగ‌పాల‌వుతుంద‌ని అంతా భేజారెత్తుతున్నార‌ట‌. అన్న‌ట్టు ఇందులో అమెరికా తెలుగు సంఘాల పాత్ర‌పైనా దర్యాప్తు సాగించిన పోలీసులు ఏకంగా తానా అధ్య‌క్షుడినే ప్ర‌శ్నించ‌డంతో ఒక‌టే గుభేల్మ‌నిపోతోందిట‌.

చికాగో సెక్స్ రాకెట్‌లో లోతుగా వెళ్లే కొద్దీ ఇంకా చాలా సంగ‌తులే తెలుస్తున్నాయి. ఈ రాకెట్‌ని ప్రారంభించి ఏళ్ల‌కు ఏళ్లు సాగించిన దందాలో కిష‌న్ అలియాస్ రాజు, చంద్ర‌క‌ళ దంప‌తులు ఓ రేంజులో సంపాదించుకున్నార‌ట‌. ఈ సంప‌ద‌ విలువ ఏకంగా 40 కోట్లు (6 మిలియ‌న్ డాల‌ర్లు) ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్నారు. క‌థానాయిక లేదా యాంక‌ర్ల‌ను ఒక్కొక్క‌రికి ఒక్కో రేటు నిర్ణ‌యించి విటుల చెంత‌కు పంపేవారు. ఒక‌సారికి 2 ల‌క్ష‌లు ($2000 to $3000) వ‌సూలు చేసేవార‌ట‌. దొరికిపోయిన ఐదుగురు క‌థానాయిక‌ల్లో ఒక్కొక్క‌రు ఐదారు కోట్లు వెన‌కేసుకుని ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి తీగ ప‌ట్టుకుని డొంకంతా లాగేసిన ఫెడ‌ర‌ల్ పోలీసులు ఇండియాలో బిగ్ ఫిష్‌లు, షార్క్‌ల్ని వెంటాడి వేటాడ‌తారా? లేక వ‌దిలేస్తారా? అంటూ మాట్లాడుకుంటున్నారు.

User Comments