బిగ్ ట్విస్ట్:  మెగా బ్ర‌ద‌ర్ ఓటు న‌రేష్ కే

Last Updated on by

`మా` ఎన్నిక‌ల నేప‌థ్యంలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అంతా శివాజీ రాజా వైపు ఉంటుంద‌ని ఊహాగానాలు వ‌స్తోన్న‌ నేప‌థ్యంలో నాగ‌బాబు నా ఓటు న‌రేష్ ఫ్యానల్ కే అంటూ సంచ‌ల‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. న‌రేష్ ప్యాన్ లో స‌భ్యులు నాగ‌బాబుని క‌లిసిన నేప‌థ్యంలో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనికి గురించి నాగ‌బాబు మాట్టాడుతూ, ` నా స‌పోర్ట్ న‌రేష్, జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ల‌కే ఉంటుంది. ఎందుకంటే అధ్య‌క్షుడిగా ఎప్పుడూ ఒకరే ఉండ‌కూడ‌దు. నేను ప్రెసిడెంట్ గా ఉన్న‌ప్పుడు నా కాల ప‌రిమితి ముగిసినా మ‌ళ్లీ న‌న్నే చేయ‌మ‌న్నారు. కానీ రెండవ‌సారి ఉండ‌టం ఇష్టం లేదు. అస‌లు మా లో ఇలాంటి కాన్సెప్ట్ ఉండ‌కూడ‌దు. ఎవ‌రైనా ఒక‌సారే చేయాల‌ని చాలాసార్లు చెప్పాను.

ఈసారి న‌రేష్ పోటీ చేస్తాన‌ని చెప్పిన‌ప్పుడు సంతోషంగా అనిపించింది. న‌రేష్ సీనియ‌ర్ మోస్ట్ యాక్ట‌ర్. ఎన్నోసినిమాల్లో హీరోగా న‌టించాడు.  జంధ్యాల‌గారి సినిమాలు ఎక్కువ‌గా చేసాడు. రాజ‌శేఖ‌ర్ గారు హీరోగా బిజీ. జీవిత గారు  నిర్మాణ రంగంలో బిజీగా ఉండి మా కోసం ముందుకు రావ‌డం సంతోషంగా ఉంది. పైగా మా లో ఇప్ప‌టివ‌ర‌కూ  మ‌హిళ‌ల‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. ఎగ్జిక్యుటివ్ క‌మిట్  ద‌గ్గ‌రే వాళ్ల‌ను ఆపేశాం. నాకు మేల్  డామినేష‌న్ న‌చ్చ‌దు.  కొత్త వాళ్లు కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌స్తాన‌న్న‌ప్పుడు వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేయాలి. ముందుకు తీసుకెళ్లాలి. చేయ‌రు? వ‌ద్దంటే ఎలా? అని ప్ర‌శ్నించారు. ఈ ప్యాన‌ల్ కు స‌పోర్ట్ చేయ‌డానికి కార‌ణం న‌రేష్‌, జీవిత గారేన‌ని నాగ‌బాబు  క‌రాఖండీగా చెప్పేసారు.

User Comments