`బిగ్‌బాస్-2` పార్టిసిపెంట్స్ లీక్‌

Last Updated on by

`బిగ్‌బాస్‌` సీజ‌న్ -1 బంప‌ర్‌హిట్ కొట్టింది. సీజ‌న్‌-2 మాటేమిటి? నేచుర‌ల్‌స్టార్ నాని ఈ కొత్త సీజ‌న్‌ని అంతే హిట్ చేయ‌గ‌లడా? ఎన్టీఆర్ అంత‌టి పెద్ద స్టార్ హీరోతో మొద‌టి సీజ‌న్ ఘ‌నంగా లాంచ్ అయ్యింది. ఆ స్పీడ్‌ని రెండో సీజ‌న్‌లో కొన‌సాగించ‌గ‌ల‌రా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు హైద‌రాబాద్ – అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో బిగ్‌బాస్ 2 సెట్‌ని ఘ‌నంగా నిర్మించి, ఇందులో చిత్రీక‌ర‌ణ‌కు మాటీవీ బృందం రెడీ అవుతోంది. అయితే నానీనే హోస్ట్ అన్న సంగ‌తిని స‌ద‌రు సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదింకా. త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌న్న స‌మాచారం ఉంది. ఇక‌పోతే ఈ సీజ‌న్‌2ని హీటెక్కించే పార్టిసిపెంట్స్ ఎవ‌రు? అన్న‌దానికి కొన్ని లీకులు అందాయి.

ఈసారి షోలో ఐస్‌క్రీమ్ బ్యూటీ తేజ‌స్వి మ‌దివాడ అందాలు తెలుగువారికి క‌నువిందు చేయ‌నున్నాయిట‌. అలానే హాట్& డైన‌మిక్ సింగ‌ర్ గీతా మాధురి, హీటెక్కించే సీనియ‌ర్ నాయ‌క రాశీ ఈ సీజ‌న్‌లో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్ట‌నున్నారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న `స్టూడెంట్ నంబ‌ర్ 1` సినిమాలో న‌టించి అటుపై కెరీర్ చ‌ర‌మాంకంలో ఆత్మ‌హ‌త్య చేసుకోబోయింద‌న్న ప్ర‌చారంతో గ‌జాలా పేరు అప్ప‌ట్లో మార్మోగిపోయింది. త‌ను కూడా ఈ సీజ‌న్ షోలో అడుగుపెట్ట‌నుంద‌ని తెలుస్తోంది. ఇక త‌న‌దైన ఛ‌రిష్మా, అంద‌చందాల‌తో బుల్లితెర‌పై వేడి పెంచుతున్న యాంక‌ర్ శ్యామ‌ల మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలువ‌నుంది. శ్యామ‌ల మాటీవీ షోల‌తోనే బాగా పాపుల‌ర్. ఇప్పుడు త‌న‌కు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక‌పోతే .. ఈ షోనుంచి వివాదాస్ప‌ద శ్రీ‌రెడ్డి ఔట్ అయ్యింద‌న్న స‌మాచారం అందింది. ఒక‌వేళ ఈ వివాదాల న‌టి హౌస్‌లో ప్ర‌వేశిస్తే, ఇత‌ర పార్టిసిపెంట్స్ అభ‌ద్ర‌త‌కు గుర‌వుతార‌ని బిగ్‌బాస్ 2 నిర్వాహ‌కులు భావించి దూరం పెట్టార‌ని తెలుస్తోంది. ఇదంతా శ్రీ‌రెడ్డి స్వ‌యంకృతం అన్న మాటా వినిపిస్తోంది.

User Comments