హీరో ప్రేమ‌లో బిగ్‌బాస్‌ బ్యూటీ?

Last Updated on by

ప్ర‌స్తుతం బుల్లితెర‌పై బిగ్‌బాస్ ఓ వ‌ర్గం ఆడియెన్‌ని ర‌క్తి క‌ట్టిస్తోంది. ఆ వ‌ర్గం అస‌లు బిగ్‌బాస్ లేక‌పోతే చ‌చ్చిపోతామ‌ని, చెవి కోసుకుంటామ‌నే ప‌రిస్థితి ఉంది. వేరొక వ‌ర్గం మాత్రం లైఫ్‌లో ఇలాంటి చెత్త కార్య‌క్ర‌మం వేరొక‌టి బుల్లితెర‌పై చూడ‌లేమ‌ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ చెత్తంతా మ‌న‌కెందుకులే కానీ.. అస‌లు మ్యాట‌ర్‌లోకి వ‌చ్చేద్దాం.

నాని హోస్టింగ్ చేస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో మాస్‌లో దూసుకుపోతోంది. ప‌ల్లె ప‌ల్లెనా ఆద‌ర‌ణ పొందుతోంద‌న‌డంలో సందేహం లేదు. ఇక ఈ హౌస్ నుంచి ప‌లువురు పార్టిసిపెంట్లు బ‌య‌ట‌క వెళ్లిపోయారు. ఈరోజు తేజ‌స్విని, సామ్రాట్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు బ‌య‌టికి వెళ్లిపోతారు. అయితే ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు బ‌య‌టికి వెళ‌తారు? అన్న‌ది అటుంచితే ఈ హౌస్‌లో తేజ‌స్విని పెర్ఫామెన్స్ విష‌యంలో మంచి మార్చులే వేయించుకుంది. ఆట‌ను బాగానే ఆడి మెప్పించింది. అయితే తేజ‌స్విని బ్యాక్‌డ్రాప్‌, వ్య‌క్తిగ‌త జీవితం మాత్రం తెలిసింది కొంద‌రికే. త‌ను ఓ అనాధ‌. త‌ల్లి లేదు. తండ్రి ఉన్నా త‌న‌కు దూరంగా ఉంటోంది. అన్న ఉన్నా త‌ను సెల్ఫిష్ అని వ‌దులుకుంది. ఇలా చూస్తే తేజ‌స్విని క‌ష్టాల క‌డ‌లి అంతా ఇంతా కాదు. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రినీ అంత‌గా వోన్ చేసుకుంది. కుటుంబ స‌భ్యుల్లా క‌లిసిపోయింది. ఇక సామ్రాట్‌ని త‌ను ప్ర‌త్యేకంగా చూస్తోంద‌ని హౌస్‌మేట్స్ స్వ‌యంగా చెప్పారు. సామ్రాట్ క‌ళ్ల‌లో ప్రేమ‌ను ఆశిస్తోంద‌ని, కానీ అది అత‌డి ద‌గ్గ‌ర క‌నిపించ‌డం లేదని, హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాడ‌ని తెగ కామెంట్లు చేసి న‌వ్వేసుకున్నారంతా. అదంతా అటుంచితే ఈరోజు ఎలిమినేష‌న్‌లో సామ్రాట్ వెళ‌తాడా? తేజ‌స్విని వెళుతుందా? అన్న ఉత్కంఠ సాగుతోంది. బిగ్‌బాస్‌నే స్వ‌యంగా పంచాయితీ తేల్చాల్సి ఉంది.

User Comments