Last Updated on by
ఒక సామాన్యుడికి బిగ్బాస్లో అవకాశమా? ఈ ప్రశ్న ఎందరిలోనో సందేహం రేకెత్తించింది. అయితే అనూహ్యంగా నాని హోస్టింగ్ చేస్తున్న `బిగ్బాస్ సీజన్ 2`లో అవకాశం అందుకున్నాడు నూతన్. అతడు హౌస్లో అడుగుపెట్టి తన వ్యక్తిత్వంతో, మంచితనంతో లక్షలాదిమందిని ఆకట్టుకున్నాడు. ఇటీవలే బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అవుతూ కూడా తన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని చూపించడంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. నూతన్ నాయుడు – కౌశల్ మధ్య పోటీలో నూతన్ గేం లో కంటిన్యూ అవుతాడని భావించినా, అందరి ఆలోచలని తలక్రిందులు చేస్తూ బిగ్ బాస్ నూతన్ నాయుడిని హౌస్ నుండి బయటకు పంపాడు. మొదటివారం కాస్త నెమ్మదిగా కనిపించినా రెండవవారం తన ఎమోషన్ తో, వ్యక్తిత్వంతో ఆకట్టుకున్న నూతన్ ఇంకో రెండు మూడు వారాలు హౌస్ లో ఈజీగా కొనసాగుతాడనే భావించారు.
ఆఖరి నిమిషం వరకూ సస్పెన్స్ సాగింది. కానీ శుక్రవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో కిరీటి ప్రవర్తన వల్ల, మాటల వల్ల కన్నీటి పర్యంతం అయిన కౌశల్ ఊహించని రీతిలో చివరి క్షణాల్లో ప్రజల అభిమానాన్ని, ఓటింగ్ ని గెలుచుకోగలిగాడు. దీనితో ఎవరూ ఊహించని విధంగా ఓట్ల రేసులో వెనుకబడిన నూతన్ నాయుడు అనూహ్య పరిణామాల మధ్య బిగ్ బాస్ హౌస్ ని వీడాల్సి వచ్చింది. నూతన్ బయటికొస్తూ హౌస్ మేట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కౌశల్, దీప్తి ఇద్దరూ ఆట విజయవంతంగా ఆడాలని మనస్పూర్తిగా కోరుకున్నాడు. తనని అడుగడుగునా టార్గెట్ చేసిన కిరీటి లాంటి వాళ్ళని, తనని చిన్న చూపు చూస్తున్న బాబు గోగినేని కూడా నూతన్ పల్లెత్తు మాట అనకపోవడం హైలైట్. బిగ్ బాస్ తనకు ఇచ్చిన బిగ్ బాంబ్ ని తనకు శత్రువులుగా వ్యవహరించిన కిరీటి, తనిష్, తేజస్వి, బాబు గోగినేని మీద కాకుండా తనకు స్నేహితుడు గా ఉన్న కౌశల్ మీద ప్రయోగించి కౌశల్ కి ఈ బాంబ్ బాధ్యతను గుర్తుచేస్తుందని నాయుడు చెప్పిన మాటలు అందరితో చప్పట్లు కొట్టించాయి. నూతన్కి హోస్ట్ నాని అభినందనలు చివరిగా దక్కాయి. అయితే నూతన్ ఎలిమినేట్ అయినా.. అతడిలోని సమర్ధతను అంతా గుర్తించారు. ప్రస్తుతం పలువురు దర్శకనిర్మాతలు అతడికి క్యారెక్టర్లు ఆఫర్ చేస్తున్నారని బయట చర్చ సాగుతోంది. ఓ రకంగా బిగ్బాస్లాంటి క్రేజీ షోతో జనంలో అభిమానం సంపాదించుకున్న వారు తమ సినిమాల్లో నటిస్తే అది తమకు లాభిస్తుందని దర్శకనిర్మాతలు భావించి అవకాశాలిస్తున్నారట. మొత్తానికి ఈ షోతో నూతన్ భవిష్యత్ మారిపోనుందని తెలుస్తోంది. అంతేకాదు బిగ్బాస్ షోలో పాల్గొంటున్న పలువురు అందగత్తెలకు సినీఛాన్సులు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది.
User Comments