బిగ్ బాస్-3 కింగ్ పై ప్రోమో!

బిగ్ బాస్-3కి స‌ర్వం సిద్ద‌మ‌వుతోంది. కంటెస్టెంట్ల ఎంపికి ముగ‌సింది. హోస్ట్ విష‌యంలో సందిగ్గ‌త నెల‌కొన్నా! దాదాపు కింగ్ నాగార్జున ఖాయ‌మైన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆయ‌న‌పై ఓ ప్ర‌మో షూట్ చేసి రిలీజ్ చేయ‌డానికి రెడీ వుతున్నారు. ప్ర‌స్తుతం ప్రోమోకు సంబ‌ధించిన షూట్ జ‌రుగుతోందిట. దానికి నాగార్జున హాజ‌రువుతున్న‌ట్లు స‌మాచారం. దీంతో ప్రోమో రిలీజ్ డే రోజున నాగ్ ను అధికారికంగా హోస్ట్ గా ప‌రిచయం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

రెండు సీజ‌ల‌న్ల‌కు సంబంధించిన క‌ర్టెన్ రైజ‌ర్ ఈవెంట్ గ్రాండ్ గా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో షో ప్రారంభానికి ముందు సీజ‌న్ -3కి సంబంధించి అలాంటి ఈవెంట్ ఒక‌టి చేయ‌నున్నారు. అందులో పార్టిసెపెంట్స్ స‌హా..హోస్ట్ పాల్గొంటారు. ఇప్ప‌టికే నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌ర‌డు షోతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యారు. బిగ్ బాస్-3 తో మ‌రింత ద‌గ్గ‌ర‌కానున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న్మ‌ధుడు -2 సినిమాలో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.