హాట్ బ్యూటి రివ్యూ ఫ్రమ్ లండ‌న్

Last Updated on by

బాలీవుడ్ హీరోయిన్ల‌కు పెళ్లైనా.. ఏమైనా అందాలు ఆర‌బోయ‌డంలో మాత్రం అడ్డు ఉండ‌దు. ఇప్పుడు బిపాషా కూడా ఇదే చేసింది. పైగా మొగుడితో క‌లిసి హాట్ ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. భ‌ర్త క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్ తో క‌లిసి లండ‌న్ ట్రిప్ వెళ్లింది బిప్స్. అక్క‌డే హాయిగా అందాల‌ను వీక్షిస్తూ.. త‌న అందాల‌ను కూడా బాగానే ఆర‌బోసింది. ఈ ముద్దుగుమ్మ రెచ్చిపోయిన విధానం చూసి ప్ర‌కృతి కూడా వేడెక్కిపోయింది. కొన్ని రోజులు అక్క‌డే ఉండి రెయినీ సీజ‌న్ ను భ‌ర్త‌తో క‌లిసి ఎంజాయ్ చేయ‌బోతుంది ఈ ముద్దుగుమ్మ‌.
ప‌నిలో ప‌నిగా బాలీవుడ్ లో వ‌చ్చే సినిమాల‌ను కూడా వ‌ర‌స‌గా చూస్తూ త‌న ట్విట్ట‌ర్ లో వాటిపై రివ్యూలు కూడా ఇస్తుంది ఈ భామ‌. ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తున్న స్కేరీగేమ్స్ వెబ్ సిరీస్ చూసి దానిపై త‌న రివ్యూ ఇచ్చింది బిపాషా. ముఖ్యంగా న‌వాజుద్దీన్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయి.. నువ్వు జెన్యూన్ యాక్ట‌ర్ అంటూ పొగిడేసింది. ఒక్క‌సారి మొద‌లు పెట్టిన త‌ర్వాత పూర్తి చేసేవ‌ర‌కు ఆప‌లేదు.. ఆపాల‌నిపించ‌లేదు అంటూ స్కేరీగేమ్స్ పై త‌న రివ్యూ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. ఓవైపు భ‌ర్త‌తో హాయి.. మ‌రోవైపు సినిమాలు.. అటూ ఇటూ ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

User Comments