పెళ్లి రోజు పూల్‌లో ఇలా వేడెక్కించింది!

Last Updated on by

న‌ల్ల‌క‌లువ బిపాసాబ‌సు ఎఫైర్ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టి, టీవీ న‌టుడు క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. అటుపై ఈ జంట ఆద‌ర్శ‌జీవ‌నం స‌ర్వ‌త్రా వాడి వేడి చ‌ర్చ‌కు తావిచ్చింది. బిపాస‌- క‌ర‌ణ్ జంట ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేనంత‌గా క‌లిసి జీవిస్తున్నారు. ఏం చేసినా క‌లిసే చేస్తున్నారు. టీవీ షోలు చేసినా జంట‌గానే.. సినిమాల్లో, ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించినా జంట‌గానే.. వ్యాపారంలోనూ జంట‌గానే.. . భాగ‌స్వాములుగా ఉండి సొంతంగా ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ని ప్రారంభించారు. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ స‌ర‌స‌న నాయిక‌ల్ని ఎంపిక చేసే బాధ్య‌త బిపాసానే చేప‌ట్టింది. ఇలాంటి అరుదైన దాంప‌త్య ం వేరొక చోట చూడ‌లేం… అన్న ముచ్చ‌టా సాగుతోంది.

ఇదివ‌ర‌కూ ఓ కండోమ్ యాడ్ లో బిపాస‌-క‌ర‌ణ్ జంట వేడెక్కించారు. ఇప్పుడు అంత‌కుమించి స్విమ్మింగ్ పూల్ యాక్ట్‌తో మ‌తి భ్ర‌మించేలా చేయ‌డం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. త‌మ రెండో పెళ్లిరోజు సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ జంట బీచ్ రిసార్ట్‌లోని ఓ స్విమ్మింగ్‌పూల్‌లో రొమాన్స్ అద‌ర‌గొట్టేయ‌డం.. అటుపై ఆ ఫోటోల్ని బిపాసా స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంతో అవి యువ‌త‌రంలో జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి. క‌ర‌ణ్‌సింగ్ గ్రోవ‌ర్ స‌ర‌స‌న `ఎలోన్‌` మూవీలో చేసిన రొమాన్స్‌ను మించి ఇలా స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిందే అంటూ ఒక‌టే కామెంట్లు పెడుతున్నారు. అయితే బిపాసాకు బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్‌, స్విమ్మింగ్ పూల్ సెల‌బ్రేష‌న్స్ కొత్తేమీ కాదు.. త‌న‌కు అదో క్యాజువ‌ల్ వ్యాప‌కం. పైగా పెళ్లి రోజు కాబ‌ట్టి మ‌రికాస్త ఘాటుగానే ఫోజులిచ్చింది అంతే!

User Comments