సైరాపై నింద‌లు ప‌బ్లిసిటీ స్టంటేనా?

Sensational Ask for Sye Raa AP Rights

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంపై కొత్త వివాదం ముసురుకుంటున్నది. నరసింహారెడ్డి వారసులకు సాయం చేస్తామని మాటిచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్ మాట తప్పిందని ఆ వంశస్తులు ఆరోపిస్తున్నారు. తమను ఆదుకుంటామని మాయ మాటలు చెప్పారని వారు అంటున్నారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు.

దొరవారి నరసింహారెడ్డి అలియాస్ ఉయ్యా లవాడ నరసింహారెడ్డి వారసులమైన మేము, సైరా పేరుతో మా వంశ మూలపురుషుడి చరిత్రతో సినిమా చేస్తూ వ్యాపారం చేసుకుంటున్న కొణిదెల ప్రొడక్షన్స్ వారు, మాకు సహాయం అందిస్తామని మాటిచ్చి తప్పినం దుకు, అలాగే మమ్ము పలువిధాలుగా అవమానించి, మానసిక క్షోభకు గురిచేసినందుకు తీవ్ర నిరసన తెలుపుతున్నామని దొరవారి దస్తగిరి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉయ్యాల‌వాడ క‌థ‌ను సినిమా గా చేయ‌డం అన్న‌ది చ‌ట్ట‌బ‌ద్దంగా ఎలాంటి అడ్డంకి లేదు. చ‌ట్ట‌ప్ర‌కారం జీవిత క‌థ‌ల‌ను రూపాయి ఇవ్వ‌కుండా తెర‌కెక్కించే అధికారం ఉంది. పైగా ఉయ్యాలావాడ స్వ‌ర్గ‌స్తులై 100 ఏళ్ల‌కు పైగా అవుతుంది. కానీ ఉయ్యాల‌వాడ వంశీయులు ప‌రిహారం ఇవ్వాలంటూ ఆందోళ‌న చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ చిత్ర నిర్మాత రామ్ చ‌ర‌ణ్, చిరంజీవి సినిమా ప్రారంభానికి ముందే ఆర్ధికంగా ఆదుకోవాల‌న్న సుదుద్దేశంతో సహాయం చేసిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం లో ఉంది. ఇదంతా చూస్తుంటే ప‌బ్లిసిటీ స్టంట్ అనే అనుమానానికి తావిస్తోంది.