కంటెంట్ లేదు.. కాంట్రవ‌ర్సీ త‌ప్ప‌..!

Last Updated on by

సినిమా హిట్ కావాలంటే క‌థ కావాలా.. కాంట్ర‌వ‌ర్సీ కావాలా..? ఓ సినిమా ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవ్వాలంటే హాట్ సీన్స్ ఉండాలా.. అద్భుత‌మైన కంటెంట్ ఉండాలా..? ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు వ‌స్తున్నాయి అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ఇండ‌స్ట్రీ మారుతున్న తీరు చూస్తుంటే ఇదే డౌట్స్ రాక మాన‌వు. గ‌తేడాది అర్జున్ రెడ్డి వ‌చ్చిన‌పుడు కుటుంబ ప్రేక్ష‌కుల స‌పోర్ట్ లేకుండానే అది పాత్ బ్రేకింగ్ మూవీ అయిపోయింది. ఇక ఇప్పుడు అర్జున్ రెడ్డి స్టైల్ అంటూ ఆర్ఎక్స్ 100 వ‌చ్చింది.

ఈ చిత్రం కూడా తొలిరోజే కోటిన్న‌ర షేర్ తీసుకొచ్చింది. అస‌లు హీరో ఎవ‌రో తెలియ‌దు.. హీరోయిన్ ఎవ‌రో తెలియ‌దు కానీ క‌లెక్ష‌న్లు మాత్రం బాగానే వ‌స్తున్నాయి. కంటెంట్ కంటే కూడా హాట్ సీన్స్.. లిప్ లాక్ సీన్స్ తో ఆర్ఎక్స్ 100ను ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసే ప్ర‌య‌త్నం చేసారు. కంటెంట్ లేక‌పోయినా.. బూతును న‌మ్ముకుని సినిమాలు తీస్తున్నారు ద‌ర్శ‌కులు. దాన్నే ట్రెండ్.. బోల్డ్ అంటూ కొత్త‌ప‌దాలు యాడ్ చేస్తున్నారు. ఇక యూత్ కూడా ఇలాంటి సినిమాల‌కు బాగానే అల‌వాటు ప‌డుతున్నారు.

User Comments