ఓ వైపు వీర‌త్వం.. మ‌రోవైపు బికినీ త‌త్వం

Last Updated on by

ఇది కేవ‌లం ఒక్క స‌న్నీలియోన్ కు మాత్ర‌మే సాధ్యమ‌య్యే ఉద్య‌మం. ఓ వైపు వీర‌మ‌హాదేవి అంటూ క‌త్తి ప‌ట్టుకుని వీర‌నారిలా శ‌త్రువుల మీద‌కు దండ‌యాత్ర‌కు వెళ్తూ.. మ‌రోవైపు బికినీ వేసుకుని కుర్ర‌కారు మీద‌కు యుద్ధానికి బ‌య‌ల్దేరింది స‌న్నీలియోన్. ఈ రెండింటినీ స‌మ‌పాళ్ల‌లో చేస్తూ సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. స‌న్నీలియోన్ అంటే ఇన్నాళ్లూ అందాల ఆర‌బోత మాత్ర‌మే ఉండేది. ఈమెలోని న‌టిని వాడుకోమన్నా ఎవ‌రూ వాడుకోలేదు. అంతా త‌మ‌కు కావాల్సిన అందాల్ని మాత్ర‌మే తీసుకున్నారు. కానీ ఫ‌స్ట్ టైమ్ స‌న్నీలియోన్ లోనూ ఓ న‌టి ఉంద‌ని కొంద‌రు గుర్తించారు. అందుకే ఆమెతో ఏకంగా ఓ భారీ పీరియాడిక‌ల్ డ్రామానే ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వీర‌మ‌హాదేవి అనే టైటిల్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.

Boldest Sunny Leone First Look of Veera MahaDevi

గుర్రంపై కూర్చుని లేడీ బాహుబ‌లిలా రెచ్చిపోడానికి రెడీగా ఉంది స‌న్నీలియోన్. ఈ చిత్రం కోసం ఏకంగా మూడున్నర‌ కోట్ల పారితోషికం తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది ఈ పిరియాడికల్ వార్ డ్రామా. ఇన్నాళ్లూ స‌న్నీలియోన్ అంటే అందాలే అనుకున్న వాళ్ల‌కు.. ఆమె లోని న‌టిని ప‌రిచ‌యం చేస్తామంటున్నారు వీర‌మ‌హాదేవి యూనిట్. ఈ సినిమా కోసం 150 రోజుల కాల్షీట్లను ఇచ్చేసింది స‌న్నీ. విసి వడివుడియన్ తెర‌కెక్కిస్తున్న‌ ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాలంలోనూ విడుద‌ల చేయ‌నున్నారు. అంతేలెండి.. స‌న్నీ ఉన్న‌పుడు భాష‌తో ప‌నిలేదక్క‌డ‌. ఓ వైపు ఇంత సీరియ‌స్ సినిమాలో చేస్తుంది క‌దా.. మ‌రోవైపు త‌న పాత ప‌ద్ద‌తులు మాత్రం మార్చుకోలేదు స‌న్నీ. నెట్టింట హాయిగా బ్లాక్ అండ్ వైట్ లో అందాల‌న్నీ ఆర‌బోసింది. ఏదేమైనా అటు అభిమానుల‌ను.. ఇటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను స‌రిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది స‌న్నీలియోన్.

Boldest Sunny Leone First Look of Veera MahaDevi

User Comments