రాజ్ త‌రుణ్ తో అదితిరావు హైద‌రీ రొమార్స్!

బాలీవుడ్ భామ అదితిరావు హైద‌రీ రాజ్ త‌రుణ్ తో రొమాన్స్ చేయ‌బోతుందా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. రాజ్ త‌రుణ్ హీరోగా విజ‌య్ కుమార్ కొండా ఓ సినిమా తెర‌కెక్కించ‌నున్న‌ సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. దీనిలో భాగంగా రాజ్ స‌ర‌స‌న అదితి అయితే బాగుంటుంద‌ని బాగుటుంద‌ని భావిస్తున్నారుట‌. ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఇప్ప‌టికే ఆమెను సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. అయితే ఆమె నుంచి ఇంకా ఎలాంటి సిగ్నెల్స్ రాన‌ట్లు తెలుస్తోంది. మ‌రి రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న అదితి అన్న ఆలోచ‌న ఎలా త‌ట్టిందో గానీ!

రాజ్ త‌రుణ్ పెద్ద హైట్ కాదు. కానీ అదితి అత‌నిక‌న్నా ఎత్తుగా ఉంటుంది. మ‌రి క‌థ‌కి…ఎత్తుకి, ఏదైనా స‌బంధం ఉందేమో చూడాలి. గ‌తంలోవిజ‌య్ కుమార్ నితిన్ గుండెజారి గ‌ల్ల‌త‌యిందే సినిమా తెర‌కెక్కించాడు. అందులో హీరోయిన్ నిత్యామీన‌న్ పొట్టి. హీరో నితిన్ హైట్. క‌థ క్లైమాక్స్ లో హీరో హైట్ కోసం హీరోయిన్ కు స్టూల్ వేస్తాడు. ఆ సీన్ సినిమాలో బాగా ప‌డింది. మ‌రి రాజ్ త‌రుణ్ తో అలాంటి సీన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడో? ఏమో. అదితి ఇప్ప‌టికే `చెలియా`, `స‌మ్మోహ‌నం`, `అంత‌రిక్షం` వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే.

Also Read: Tv Actress Fight For Gold Chain