బిగ్‌బి కోడ‌లుపై వివేక్ పంచ్

నిన్న‌టి రోజున ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. విక్ట‌రీ ఖాయం అనుకున్న‌వాళ్లంతా అప్పుడే పార్టీల‌తో చిలౌట్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ ఐశ్వ‌ర్య‌రాయ్ ఫో టోను ఎగ్జిపోల్స్ తో పోలుస్తూ ట్వీట్ చేసాడు. ఈ ఫోటోలో ఐష్ -స‌ల్మాన్ తో, వివేక్ తో, అభిషేక్ తో ఉన్నారు. స‌ల్మాన్-ఐష్ ఉన్న ఫోటో పై అభిప్రాయం అని, ఐష్-వివేక్ ఫోటోపై ఎగ్జిట్ పోల్స్ అని, ఐష్-అభిషేక్ ఉన్న పిక్ పై రిజ‌ల్ట్ అని రాసుంది. ఈ పిక్ ను ఉద్దేశించి హ హ..క్రియేటివ్. ఇది రాజ‌కీయం కాదు. జ‌స్ట్ లైక్ అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. అది చూసిన మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్ర‌హంతో ఊగిపోయింది.

నీ మీద అస‌హ్యంగా ఉంది వివేక్ అంటూ మండిప‌డింది. నెటిజ‌నులు కూడా వివేక్ చేసిన ప‌నిని త‌ప్పు బ‌ట్టారు. ఐష్ జీవితాన్ని రాజ‌కీయాల‌తో ఎలా పోల్చుతావ్ అంటూ ఆగ్ర‌హం చెందారు. అయితే ఇక్క‌డో విష‌యం చెప్పాలి. ఐష్-వివేక్ `క్యూ హోగ‌యానా` సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని, పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. ఈ సంగ‌తి తెలిసిన స‌ల్మాన్ వివేక్ కి వార్నింగ్ ఇచ్చాడ‌ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపాడు. స‌ల్మాన్ తో ఐష్ ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే. చివ‌రిగా ఐష్ అభిషేక్ వ‌ద్ద లాక్ అయింది.