కేసీఆర్.. యంగ్ హీరో కాదు, విలక్షణ నటుడు 

తెలంగాణ పోరాట యోధుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుందని చాలారోజులుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ తన దర్శకత్వంలోనే పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి కేసీఆర్ బయోపిక్ ను తెరకెక్కించబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. ఇక ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావడంతో చిత్ర యూనిట్ నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ఈ కేసీఆర్ బయోపిక్ లో కేసీఆర్ గా బాలీవుడ్ యంగ్ హీరో రాజ్ కుమార్ రావు నటించనున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే. ముఖ్యంగా నటుడిగా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న రాజ్ కుమార్ రావు పర్సనాలిటీ పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగానూ చూడటానికి కొంచెం కేసీఆర్ లానే ఉండటంతో.. ఈ ప్రాజెక్ట్ కు తనే పర్ఫెక్ట్ అని మొన్నటివరకు అనుకున్నారు. ఇదే సమయంలో మధుర శ్రీధర్ కూడా రాజ్ కుమార్ రావును దాదాపుగా ఓకే చేసేశామని హింట్ కూడా ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఈ యంగ్ హీరోని కాదని.. ఓ విలక్షణ నటుడ్ని కేసీఆర్ పాత్ర కోసం తెరపైకి తెస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఇక ఆ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కావడంతో కేసీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నా.. పాత్రల ఎంపికలోనూ వైవిధ్యం చూపిస్తూ అద్భుతమైన నటనతో నవాజుద్దీన్ దేశం మొత్తం గుర్తింపు తెచ్చుకోవడంతో ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ ఎక్కడికో వెళ్లనుందనే ఆశలు రేకెత్తిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు గాని, క్యారెక్టర్ కోసం ఫిజికల్ గా కూడా ఎలాంటి మేకోవర్ కైనా రెడీ అయ్యే నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ ప్రాజెక్టుకు ఓకే చెబితే.. కేసీఆర్ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఈ లెక్కన కేసీఆర్ గా టాలెంట్ చూపిస్తున్న యంగ్ హీరో కనిపిస్తాడా? లేక టాలెంటెడ్ నటుడు కనిపిస్తాడా? అనేది తొందరగా తెలియాల్సిందే.