బాలీవుడ్ స్టార్స్ చేతిలో ప్యాడ్ మ్యాన్

Last Updated on by

సెక్స్ అనే ప‌దాన్నే మ‌నం ప‌దిమందిలో ప‌ల‌క‌డానికి ఇబ్బంది ప‌డ‌తాం. కానీ అలాంటి కాన్సెప్టుల‌తోనే సినిమాలు చేస్తున్నారిప్పుడు. ఇక ఆడాళ్ల ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ గురించి బ‌య‌టికి చెప్పుకోడానికి చాలా ఇబ్బంది ప‌డుతుంటారు. ముఖ్యంగా వాళ్ల పీరియ‌డ్స్ స‌మ‌స్య‌లు.. దానికోసం వాళ్లు వాడే సానిట‌రీ న్యాప్కిన్ గురించి చెప్పుకోవాలంటే చాలా సిగ్గు ప‌డేవాళ్లు. కానీ ఇప్పుడు అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఏకంగా ఈ కాన్సెప్ట్ తోనే ఇప్పుడు ప్యాడ్ మ్యాన్ సినిమా చేసాడు అక్ష‌య్ కుమార్.

ప్యాడ్ మ్యాన్ ప్ర‌మోట్ చేసుకోవాలంటే న్యాప్కిన్ తీసి చేతుల్లో ప‌ట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఇదే చేస్తుంది బాలీవుడ్. అమీర్ ఖాన్ నుంచి అలియా భ‌ట్ వ‌ర‌కు అంతా ప్యాడ్ మ్యాన్ కు స‌పోర్ట్ గా నిలుస్తున్నారు. ఓ డేరింగ్ కాన్సెప్ట్ చేస్తున్నందుకు అక్ష‌య్ కుమార్ కు అంతా సాయం చేస్తున్నారు. ఫ్రీగా ప్ర‌మోష‌న్ చేసి పెడుతున్నారు. ప్ర‌తీ ఒక్క‌రు చేతిలో సానిట‌రీ న్యాప్కిన్ ప‌ట్టుకుని ఫోటోలు దిగుతున్నారు. త‌మవంతుగా ప్యాడ్ మ్యాన్ కు అండ‌గా నిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని బాల్కీ తెర‌కెక్కించాడు. ఫిబ్ర‌వ‌రి 9న సినిమా విడుద‌ల కానుంది.

User Comments