రేప్ చేస్తే తప్పు.. పడుకొంటే ఒప్పు

Last Updated on by

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి ర‌చ్చ బాగా న‌డుస్తుంది. అప్పుడెప్పుడో హాలీవుడ్ లో మీ టూ క్యాంపైన్ ర‌న్ చేసి అక్క‌డి హీరోయిన్లంతా ర‌చ్చ చేసారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీ‌రెడ్డి పుణ్య‌మా అని ఇది మ‌రింత ఎక్కువైపోయింది. మీడియా ఛానెల్స్ కూడా ఇంకే న్యూస్ దొర‌క‌న‌ట్లుగా శ్రీ‌రెడ్డిని టాప్ సెలెబ్రెటీగా మార్చేసారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ టాప్ కొరియోగ్ర‌ఫ‌ర్ స‌రోజ్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఈమె ఇన్ డైరెక్ట్ గా కాస్టింగ్ కౌచ్ ని సమర్థించడం ఇప్పుడు బాలీవుడ్ లో సంచ‌ల‌నం అయిపోయింది. ఈమె జాతీయ అవార్డ్ కూడా గెలుచుకున్నారు. ఇలాంటి వ్య‌క్తి నుంచి క్యాస్టింగ్ కౌచ్ ను సమ‌ర్థించే వ్యాఖ్య‌లు రావ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. ఆమె దాని గురించి మాట్లాడినా వెంట‌నే మ‌ళ్లీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. రేప్ చేసి వదిలేయడం లేదుగా.. వాళ్ల‌కు ఆఫ‌ర్లు ఇస్తున్నారు అన్నం దొరుకుతుందంటూ మాట్లాడారు. సరోజ్ ఖాన్ కామెంట్స్ పై ఇప్పుడు నార్త్ మీడియా కూడా త‌ప్పు ప‌డుతుంది.

క్యాస్టింగ్ కౌచ్ గురించి నిర్ణ‌యం తీసుకోవాల్సింది మ‌నం కాదు.. ఆ అమ్మాయిలే అంటూ మ‌రో సంచ‌ల‌న కామెంట్ చేసారు ఈమె. అవకాశాల కోసం అమ్ముడుపోవాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు. మనలో టాలెంట్ ఉంటె ఇలాంటి అడ్డ దారులని ప్రోత్సహించాల్సిన అవసరం ఏంటని సరోజ్ ఖాన్ కామెంట్ చేసారు. ఇది కేవ‌లం సినిమా రంగానికి మాత్రమే సంబంధించిన విషయం కాదని.. సమాజం మొత్తానికి వర్తిస్తుందని చెప్పారు స‌రోజ్. సినిమా అనేది ఫోక‌స్ లో ఉంటుంది కాబ‌ట్టి ఇక్క‌డ హైలైట్ అవుతుంద‌ని.. గ‌వ‌ర్న‌మెంట్ సంస్థ‌ల్లో కూడా జ‌రుగుతున్నాయి కదా అంటూ ప్ర‌శ్నించింది స‌రోజ్ ఖాన్. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నోట్లోంచి క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు రావ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ముందు కాస్త తేడాగా మాట్లాడినా.. వెంట‌నే తేరుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో స‌రోజ్ ఖాన్ బ‌య‌ట‌ప‌డింది. లేదంటే ఆమె ఇప్పుడు మీడియాకు విందు భోజ‌నంగా మారేది.

User Comments