సోన‌మ్ క‌పూర్ ను ఆపడం కష్టం

సోన‌మ్ క‌పూర్.. ఈ పేరు వింటే సినిమాల కంటే ముందు ఫ్యాష‌న్ గుర్తుకొస్తుంది. ఈ భామ దృష్టి కూడా సినిమాల కంటే ఎక్కువ‌గా ఫ్యాష‌న్ పైనే ఉంటుంది. సినిమాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోదు కూడా. వ‌చ్చిన‌పుడు చేస్తూ వెళ్తుండ‌టం త‌ప్ప‌.. అవే కావాల‌ని కూర్చునే ర‌కం కాదు సోన‌మ్ క‌పూర్ ది.
Bollywood Diva Sonam Kapoor Busy Schedule in 2018
అందుకే ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లు దాటినా ఇప్ప‌టికీ సోనమ్ రేస్ లో క‌నిపించ‌దు. అయితే స్టార్ హీరోలే ఇప్పుడు పిలిచి మ‌రీ అవ‌కాశాలిస్తున్నారు సోన‌మ్ కు. ఇన్నాళ్లూ ఒక లెక్క‌.. ఇప్పుడు ఒక లెక్క అన్న‌ట్లుంది ఇప్పుడు ప‌రిస్థితి. 2018లో సోన‌మ్ క‌పూర్ ఏకంగా ఐదు సినిమాల‌తో వస్తుంది.. అది కూడా చాలా త‌క్కువ గ్యాప్ లోనే.
Bollywood Diva Sonam Kapoor Busy Schedule in 2018
ఫిబ్ర‌వ‌రి 9న ఈమె న‌టించిన ప్యాడ్ మ్యాన్ విడుద‌ల అయింది. అక్ష‌య్ కుమార్ ఇందులో హీరో. ఇక జూన్ 1న వీరి డి వెడ్డింగ్ విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో క‌రీనా క‌పూర్ కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. జూన్ 29న సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ రానుంది. రాజ్ కుమార్ హిరాణి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్ పాత్ర‌లో ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నారు చిత్ర‌యూనిట్.
Bollywood Diva Sonam Kapoor Busy Schedule in 2018
ఇక ఏక్ ల‌డకా కో దేఖ్ తా తో ఐసే ల‌గా సినిమాలోనూ న‌టిస్తుంది. ఈ సినిమా అక్టోబ‌ర్ 12న విడుదల కానుంది. ఇక ఇదే ఏడాది చివ‌ర్లో ది జోయా ఫ్యాక్ట‌ర్ విడుద‌ల కానుంది. ఇలా ఈ ఏడాది ఏకంగా అర‌డ‌జ‌న్ సినిమాల‌తో సంద‌డి చేయ‌డానికి రెడీగా ఉంది సోన‌మ్ క‌పూర్. ఇవి కాకుండా ఫ్యాష‌న్ ప్రోగ్రామ్స్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది ఈ భామ‌. ఎటు చూసుకున్నా 2018 పూర్తిగా సోన‌మ్ కే రాసివ్వాలేమో..?

User Comments