స‌ల్మాన్.. ఎవ‌ర్ గ్రీన్ కండ‌ల కాంతారావు..!

Last Updated on by

వ‌య‌సు 40 దాటితే ఫిట్ నెస్ పోతుంది. రోజూ క‌ష్ట‌ప‌డితే కానీ ఉన్న ఫిట్ నెస్ మెయింటేన్ చేయ‌డం సాధ్యం కాదు. అందుకే స్టార్ హీరోలు కూడా 40 దాట‌గానే లుక్స్ లో కూడా మార్పులు వ‌స్తాయి. ఇక 50ల్లోకి వ‌స్తే ముదురు అని ఫిక్సైపోవ‌చ్చు. అప్పుడు డూప్ ల‌ను పెట్టుకుని అన్నీ మ్యానేజ్ చేసేయ‌డ‌మే. కానీ స‌ల్మాన్ ఖాన్ మాత్రం దీనికి విరుద్ధం. వ‌య‌సు 52కి వ‌చ్చినా కూడా ఇప్ప‌టికీ ఈయ‌న ఫిట్ నెస్ చూస్తుంటే పిచ్చెక్క‌డం ఖాయం అస‌లు కుర్ర హీరోలు కూడా కుళ్లుకునేలా ఈయ‌న బాడీ మెయింటేన్ చేస్తున్నాడు.

సిక్స్ ప్యాక్ ట్రెండ్ కు ఆధ్యుడిగా బాలీవుడ్ లో స‌ల్మాన్ కు పేరు. తొలి సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కండ‌ల‌వీరుడు అలాగే ఉన్నాడు. కాక‌పోతే అప్పుడప్పుడూ కాస్త లావు.. మ‌ళ్లీ స‌న్న‌బ‌డ‌టం చేసాడేమో కానీ సిక్స్ ప్యాక్ మాత్రం ష‌ర్ట్ వెన‌కాల అలాగే ఉంది. ఇది మెయింటేన్ చేయ‌డం అంటే అంత ఈజీ కాదు. 30 ఏళ్లుగా త‌న బాడీ చూసుకుంటున్నాడంటే దాని వెన‌క కొన్నేళ్ల క‌ష్టం దాగుంది. ఇప్పుడు కూడా స‌ల్మాన్ బాడీ పిక్ ఒక‌టి విడుద‌లైంది. అద్దం ముందు కూర్చుని ఉన్న స‌ల్మాన్ ను చూసి షాక్ అవ్వ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేం. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

User Comments