బాలీవుడ్ బంగారు బాతులు

Last Updated on by

బాలీవుడ్‌లో న‌లుగురు యువ‌క‌థానాయిక‌లు పేరెంట్‌కి బంగారు బాతులుగా మారారు. వీళ్లు ధ‌నార్జ‌న‌లో పెచ్చు మీరి సంపాదిస్తున్నారు. ఒక్కొక్క‌రు కోట్ల‌కు కోట్లు ఖాతాలో వేసుకుంటూ భారీగా ఆర్జించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఆస‌క్తిక‌రంగా ఇందులో ముగ్గురు క‌పూర్ గాళ్స్ అయితే, ఒక‌రు ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్ సుపుత్రిక. గారాల‌ప‌ట్టీ. వీళ్లంతా బిగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో బ‌రిలో దిగి, అటుపై స్వీయ‌సంక‌ల్పం, కృషితో ఎద‌గ‌డం మెచ్చ‌ద‌గినది.

నిరంత‌రాయంగా నెప్టోయిజం (న‌ట వార‌స‌త్వం) గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న వేళ ఈ న‌లుగురు భామ‌ల క‌థాక‌మామీషు ప‌రిశీలిస్తే ఎంతో ఆస‌క్తిక‌రం. బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ క‌పూర్ గారాల ప‌ట్టీ సోన‌మ్ క‌పూర్ 120 కేజీల బ‌రువు ఉండేది. అనూహ్యంగా అమ్మ‌డు హీరోయిన్ అయిపోతానంటూ పాపాకి చెప్పి ఏకంగా 80 కేజీల‌కు త‌గ్గిపోయింది. క‌ట్ చేస్తే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఒక్కో సినిమాకి 6-7 కోట్లు అందుకుంటోంది. నీర్జా సినిమాతో ప‌లు అవార్డులు రివార్డులు అందుకుని అద‌ర‌గొట్టేసింది. సోన‌మ్ రీసెంట్ మూవీ `వీరే ది వెడ్డింగ్‌` బంప‌ర్ హిట్. వివాదాల‌తో సోన‌మ్‌కి మ‌రింత పేరు తెచ్చింది. ఇక సోనాక్షి సిన్హా షాట్‌గ‌న్ శ‌త్రుఘ్న సిన్హా కుమార్తె అన్న సంగ‌తి తెలిసిందే. ఈ భామ తెలివిగా స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న ద‌బాంగ్ చిత్రంలో న‌టించింది. అటుపై స‌ల్లూ భాయ్ అండ‌దండ‌ల‌తో టాప్ రేంజుకి ఎదిగేసింది. సోనాక్షి ఒక్కో సినిమాకి ఏకంగా 6-8 కోట్లు అందుకుంటూ హ‌వా సాగిస్తోంది. ఛ‌మ్కీ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్ న‌టుడు శ‌క్తి క‌పూర్ న‌ట‌వారసురాలిగా రంగ ప్ర‌వేశం చేసి ఇండ‌స్ట్రీని ఏల్తోంది. ఆషికి 2, ఏక్ విల‌న్ వంటి బంప‌ర్ హిట్ల‌తో అమ్మ‌డు స్కైలోకి దూసుకెళ్లింది. బాలీవుడ్ బెస్ట్ పెర్ఫామ‌ర్స్‌లో శ్ర‌ద్ధా టాప్ పొజిష‌న్‌లో ఉంటుంది. ఈ భామ ఒక్కో క‌మిట్‌మెంట్‌కి 6కోట్ల పారితోషికం అందుకుంటూ సెగ‌లు పుట్టిస్తోంది. ప్ర‌స్తుతం ఇండియాస్ బెస్ట్ యాక్ష‌న్ మూవీ సాహోలో బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తూ ఇత‌ర నాయిక‌ల్లో గుబులు రేపుతోంది. ఇక ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్ కుమార్తె ఆలియా భ‌ట్ ఏకంగా 100కోట్ల క్ల‌బ్ నాయిక‌గా స‌త్తా చాటింది. ఈ భామ న‌టించిన రాజీ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. రోజా చిత్రంలో మ‌ధుబాల‌కు వ‌చ్చినంత పేరు రాజీ చిత్రంతో ఆలియా ద‌క్కించుకుంది. ఆలియా నిన్న‌గాక మొన్న వ‌చ్చి 4-5కోట్ల పారితోషికం అందుకుంటూ టాప్ రేంజుకి ఎదిగేసింది. వీళ్లంతా బంగారు గుడ్లు పెట్టే బాతులు. జీరో, గ‌ల్లీ బోయ్‌, క‌ళాంక్‌, బ్ర‌హ్మాస్త్ర వంటి ఇండ‌స్ట్రీ బెస్ట్ సినిమాల్లో న‌టిస్తూ కాక‌లు పుట్టిస్తోంది. న‌ట‌వార‌సులుగా వ‌చ్చినా.. స్వీయ‌ప్ర‌తిభ‌తో ఈ రేంజుకి ఎదగ‌డం అన్న‌ది నిజంగానే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

User Comments