ప‌వ‌న్ కోసం బాలీవుడ్ నుంచి

ఒకేసారి మూడు సినిమాలకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసిన ప‌వ‌న్‌ని ఇప్పుడు హీరోయిన్ల స‌మ‌స్య వేధిస్తోంది. నచ్చిన హీరోయిన్ ఖాళీగా లేదు, ఖాళీగా ఉన్న హీరోయిన్లు న‌చ్చ‌డం లేదు. దాంతో ఇంకా క‌థానాయిక‌ల వేట కొన‌సాగుతూనే ఉంది. ముఖ్యంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాకి సంబంధించి రోజుకో కొత్త పేరు వెలుగులోకి వ‌స్తుంది. నిన్న‌టిదాకా కీర్తి సురేష్ ఎంపికైంద‌ట అన్నారు. ఈ రోజేమో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెర‌పైకొచ్చింది. చివ‌రికి ఎవ‌రు ఎంపిక‌వుతార‌నేదే ఇప్పుడు స‌స్పెన్స్‌. ఇందులోని విల‌న్ కోసం కూడా బాలీవుడ్‌లోనే వెదుకుతున్నాడ‌ట క్రిష్‌. అర్జున్ రామ్‌పాల్‌ని ఈ సినిమాలో విల‌న్ కోసం ఎంపిక చేయాల‌నే నిర్ణ‌యానికొచ్చిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. మ‌రి హీరోయిన్‌ని కూడా అక్క‌డ్నుంచి తెచ్చుకుంటాడేమో చూడాలి.