బిగ్ షాక్ : జ‌య‌ల‌లిత‌గా కాంట్ర‌వ‌ర్శీ క్వీన్

Last Updated on by

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి.. అమ్మ జ‌య‌ల‌లిత‌పై ఇప్ప‌టికే మూడు బ‌యోపిక్ లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వ‌రిలో అమ్మ జ‌యంతి రోజున లాంఛ‌నంగా ఇవి ప్రారంభ‌మ‌య్యాయి. వీటిలో నిత్యామీన‌న్ టైటిల్ పాత్ర‌లో `ది ఐర‌న్ లేడి` పేరుతో బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పుర‌చ్చి త‌లైవి (విప్ల‌వాల నాయ‌కురాలు) గా పేరు బ‌డ్డ జ‌య‌ల‌లిత జీవితాన్ని వెండితెర‌కెక్కించేందుకు ఎంద‌రో ఉవ్విళ్లూరుతున్నారు.

తాజాగా `నాన్న‌` ఫేం ఏ.ఎల్.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విబ్రి& క‌ర్మ మీడియా అండ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ‌ నిర్మించ‌నున్న కొత్త బ‌యోపిక్ ని లాంఛ‌నంగా ప్రారంభించారు. విష్ణు ఇందూరి, శేలైష్ ఆర్‌.సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో న‌టించ‌నున్నారు. త‌మిళంలో త‌లైవిగా, హిందీలో జ‌య పేరుతో రిలీజ్ కానుంది. తెలుగు వెర్ష‌న్ గురించి స‌రైన స‌మాచారం లేదు. ఇక ఈ చిత్రానికి బాహుబ‌లి రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తున్నారు. బాహుబ‌లి, భ‌జ‌రంగి భాయిజాన్, మ‌ణిక‌ర్ణిక వంటి బాక్సాఫీస్ సెన్సేషన్స్ కి కార‌కుడైన విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి క‌థను అందించ‌డం ఆస‌క్తిక‌రం. ద‌ర్శ‌కుడు ఏ.ఎల్.విజ‌య్ మాట్లాడుతూ ..“అమ్మ జ‌య‌ల‌లిత దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న‌ గొప్ప నాయ‌కురాలు. త‌న‌పై సినిమా తీయ‌డం అంటే బాధ్య‌త‌. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ కంగ‌న‌తో ఈ సినిమా తీసే అవ‌కాశం రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను“ అని తెలిపారు. తెలుగు, త‌మిళంలో కంగ‌న ఇదివ‌ర‌కూ క‌థానాయిక‌గా న‌టించింది. తిరిగి కొంత గ్యాప్ త‌ర్వాత అమ్మ జ‌య‌ల‌లిత బ‌యపిక్ తో సౌత్ కి మ‌రింత‌ ద‌గ్గ‌ర‌వుతోంద‌న్న‌మాట‌!

Also Read: After Lakshmi Bai Its  Jayalalitha

User Comments