భార‌తీయుడు 2`లో దేవ‌గ‌ణ్‌?

Last Updated on by

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ -శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ `భార‌తీయుడు`(1996) సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. దాదాపు రెండు ద‌శాబ్ధాల క్రితం రిలీజైన ఈ సినిమా అవినీతిపై ఎక్కుపెట్టిన తిరుగులేని బాణంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. అప్ప‌ట్లోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడులో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజైన ఈ చిత్రం అసాధార‌ణ విజ‌యం సాధించింది. ఇండియా త‌ర‌పున అధికారికంగా ఆస్కార్ బ‌రిలోకి వెళ్లింది ఈ చిత్రం. అలాంటి గ్రేట్ మూవీకి సీక్వెల్ వ‌స్తే చూడాల‌న్న త‌హ‌త‌హ అభిమానుల్లో ఉన్నా.. ఇంత‌కాలం ఈ సీక్వెల్‌ ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్ప‌టికైతే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట‌య్యాయి. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే రామోజీ ఫిలింసిటీలో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ స్టార్ట్ చేస్తార‌ని తెలుస్తోంది.

ప‌నిలో ప‌నిగా ఈ చిత్రంలో కాస్టింగ్ బ‌లం పెంచే ప‌నిలో శంక‌ర్ బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది. క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు ఈ సినిమాలో ధీటుగా న‌టించే బాలీవుడ్ స్టార్‌ని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. తెలుగు, త‌మిళ్‌, హిందీలో అద్భుతమైన క్రేజుతో రిలీజ్ చేయాలంటే అవ‌స‌ర‌మైన స్టార్ ప‌వ‌ర్‌, హంగులు యాడ్ చేసే ప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈ చిత్రంలో న‌టించే స‌ద‌రు బాలీవుడ్ స్టార్ ఎవ‌రై ఉంటారు? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. శంక‌ర్‌కి అజయ్‌దేవ‌గ‌న్‌, అక్ష‌య్‌కుమార్ స‌న్నిహితులు.. ఆ ఇరువురిలో ఎవ‌రో ఒక‌రు ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే అక్ష‌య్ 2.ఓ (రోబో2)లో న‌టిస్తున్నాడు కాబ‌ట్టి మార్పుకోసం ఆలోచిస్తే అజయ్ దేవ‌గ‌న్ న‌టించే ఆస్కారం ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికైతే ఆ స్టార్ ఎవ‌రు అన్న‌ది స‌స్పెన్స్‌. ఇక టాలీవుడ్ నుంచి ఓ ప్ర‌ముఖ స్టార్‌కి ఈ చిత్రంలో న‌టించే అవ‌కాశం ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌ల్టీలింగువ‌ల్స్ బిజినెస్ రేంజు పెరుగుతోంది కాబ‌ట్టి శంక‌ర్ ఈ తీరుగా ప్లాన్ చేస్తున్నార‌ని భావించ‌వ‌చ్చు.

User Comments