ప‌వ‌న్ తాత ఫోటోగ్రాఫర్ అయ్యాడు

Last Updated on by

ప‌వ‌న్ తాత ఫోటోగ్రాఫర్ ఏంటి అనుకుంటున్నారా..? ఇక్క‌డ ప‌వ‌న్ తాత అంటే బోమ‌న్ ఇరాని. అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ కు తాత‌గా న‌టించాడు ఈయ‌న‌. ఆ త‌ర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసాడు బోమ‌న్. అయితే ఇప్ప‌టికీ అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ తాత‌గానే బోమ‌న్ ప్రేక్ష‌కుల‌కు గుర్తిండిపోయాడు. న‌టుడిగా ఇప్ప‌టికే ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించాడు బోమ‌న్. హిందీ, తెలుగు ఇండ‌స్ట్రీల్లో మాత్ర‌మే న‌టిస్తూ వ‌చ్చిన బోమ‌న్ ఇరానీ.. ఇప్పుడు త‌మిళ్ లోకి కూడా అడుగు పెడుతున్నాడు. అక్క‌డ సూర్య సినిమాలో న‌టిస్తున్నాడు ఈయ‌న‌.

Boman irani clicked sayyesha saigal photo

కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ లండ‌న్ లో జ‌రుగుతుంది. ఇందులో స‌యేషా సైగ‌ల్ హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ లోనే భాగంగా ఫోటోగ్ర‌ఫ‌ర్ అవ‌తారం ఎత్తాడు బోమ‌న్. హీరోయిన్ స‌యేషాను అందంగా రెండు క్లిక్స్ కూడా తీసాడు. ఆ ఫోటోల‌ను స‌యేషా కూడా చాలా జాగ్ర‌త్త‌గా దాచుకుంది. ఇవి బోమ‌న్ ఇరానీ స‌ర్ తీసిన ఫోటోలంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఫుల్ గా జూమ్ ఇన్ చేసి స‌యేషాను త‌న కెమెరాలో బాగానే బంధించాడు ఈ న‌టుడు. మొత్తానికి ఈయ‌న‌లో న‌టుడు మాత్ర‌మే కాదు.. మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడ‌న్న‌మాట‌.

User Comments