12ఏళ్ల‌కు బొమ్మ‌రిల్లు సెంటిమెంట్‌

Last Updated on by

సిద్ధార్థ్ న‌టించిన‌ `బొమ్మ‌రిల్లు` రిలీజై దాదాపు 12 ఏళ్ల‌వుతోంది. ఇప్ప‌టికీ ఆ సినిమాకి బుల్లితెర‌పై ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. పెర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమాకి ఎగ్జాంపుల్ ఆ చిత్రం. ఆ సినిమాతోనే దిల్‌రాజు కెరీర్ రెట్టింపు ఊపు అందుకుంది. ఆ సినిమాతోనే పెర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమాల నిర్మాత‌గా అత‌డిని చెప్పుకున్నారు. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు.

అందుకే స‌రిగ్గా 12 ఏళ్ల త‌ర్వాత ఇప్పుడు బొమ్మ‌రిల్లు సెంటిమెంటును తెలివిగా వాడేస్తున్నారు ఆయ‌న‌. నితిన్ హీరోగా దిల్‌రాజు నిర్మించిన `శ్రీ‌నివాస క‌ళ్యాణం` ఆగ‌స్టు 9న రిలీజ‌వుతోంద‌ని ఇదివ‌ర‌కూ తేదీని లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ తేదీనే ఎంపిక చేసుకోవ‌డానికి కార‌ణం .. స‌రిగ్గా 12 ఏళ్ల క్రితం 2006లో బొమ్మ‌రిల్లు అదే తేదీకి రిలీజై సంచ‌లన విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంత విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. అందుకే ఆ తేదీని లాక్ చేశామ‌ని తెలిపారు దిల్‌రాజు. నితిన్ మూవీ రిలీజ్ వెన‌క అస‌లు లాజిక్ గురించి ఈ రోజు ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశారు. అర‌కులో చిత్రీక‌రించిన పాట‌తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని తెలిపారు. ఈ సినిమాకి వెళ్లి థియేట‌ర్ల నుంచి వ‌చ్చేప్పుడు ఆనందానుభూతుల్ని పొందుతార‌ని దిల్‌రాజు కాన్ఫిడెంటుగా చెప్పారు.

User Comments