శ్రీ‌దేవికి బోనీ ఇచ్చిన షాక్‌

Last Updated on by

నా ఆత్మ నాలోనే.. అవును ఇది నిజం.. ! ఈరోజు 22 వ పెళ్లిరోజు.. నా జాన్ .. నా లైఫ్‌.. నా జీవిత‌భాగ‌స్వామి.. ప్రేమ‌, క‌రుణ‌.. ద‌య‌.. నా న‌వ్వు.. అన్నీ త‌నే.. నాలో జీవించే నా ఆత్మ‌.. ఎప్ప‌టికీ ఇలానే….

ఈ స్థాయిలో క‌వితాత్మ‌కంగా ఏ భ‌ర్త అయినా మ‌ర‌ణించిన‌ భార్య‌ను స్మ‌రించుకున్న‌ సంద‌ర్భం ఉంటుందా? అదే బోనీక‌పూర్ ప్ర‌త్యేక‌త‌. స్వ‌త‌హాగా క‌వి అయిన ఆయ‌న హృద‌యం ఇలా త‌ల‌చుకుంది. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవితో ప్రేమ‌లో ప‌డిన బోనీక‌పూర్ .. ఒక నిర్మాత‌గా కాకుండా త‌న‌ని ఒక ఆరాధ్య దేవ‌త‌గా ఆరాధించారు. ఆ క్ర‌మంలోనే త‌మ్ముడు అనీల్ క‌పూర్ స‌ర‌స‌న శ్రీ‌దేవికి అవ‌కాశం ఇచ్చి.. ఓ నిర్మాత‌గా త‌న‌కు మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యారు. ఆ క్రమంలోనే బోనీ శ్రీ‌దేవిని రెండో వివాహం చేసుకున్నారు. ఆ జంట‌కు జాన్వీ, ఖుషీ అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రూ సినీనాయిక‌లుగా వెలిగిపోయేందుకు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డింది. అయితే ఇలాంటి వేళ శ్రీ‌దేవి అనూహ్యంగా అంత‌ర్ధానం కావ‌డం.. బోనీతో పాటు కపూర్ కుటుంబం జీర్ణించుకోలేక‌పోతోంది. నేడు పెళ్లిరోజును గుర్తు చేసుకుని బోనీ శ్రీ‌దేవితో త‌న అనుబంధాన్ని ఇలా వీడియో సాక్షిగా గుర్తు చేసుకున్నారు.

User Comments