మ‌హేష్‌ని లాక్ చేస్తున్న బాస్!

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ – సుకుమార్ మ‌ధ్య డీల్ క్యాన్సిల్ అయిన త‌ర్వాత ర‌క‌ర‌కాల స‌న్నివేశాలు షాక్ ని ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ ఎఫ్ 2 డైరెక్ట‌ర్ తో ముందుకు వెళుతున్నాడు. సేమ్ టైమ్ సుకుమార్ బ‌న్నితో ప్రాజెక్టును ఖాయం చేసుకుని కాల్షీట్లు బ్లాక్ చేయించుకున్నాడు. అయితే ఈ క‌థ అంత‌టితో అయిపోయిందా? అంటే ముగిసిపోలేద‌న్న మాటా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

ఇప్ప‌టికీ మైత్రి మూవీ మేక‌ర్స్ మ‌హేష్ – సుకుమార్ జోడీని క‌లిపేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలుస్తోంది. సేమ్ టైమ్ బాస్ అల్లు అర‌వింద్ బ‌రిలో దిగి గీతా ఆర్ట్స్ లో మ‌హేష్ సినిమాకి క‌మిట్ చేయించే ప‌నిలో ఉన్నార‌ట‌. మ‌హేష్ 25 మ‌హ‌ర్షి త‌ర్వాత అనీల్ రావిపూడి – దిల్ రాజు – అనీల్ సుంకర కాంబినేష్ మూవీ మ‌హేష్ 26 పూర్త‌వుతుంది. అటుపై మ‌హేష్ 27 గీతా ఆర్ట్స్ లో చేసేలా డీల్ కుదిర్చేందుకు అల్లు అర‌వింద్ ట్రై చేస్తున్నార‌ట‌. ఇక మ‌హేష్ కి గీత గోవిందం ద‌ర్శ‌కుడు .. గీతా ఆర్ట్స్ ఆస్థాన ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి మ‌హేష్ కి వినిపించేందుకు రెడీ అవుతున్నాడు. వాస్త‌వానికి ఇదే స్క్రిప్టును బ‌న్నికి వినిపించాల‌ని ప్ర‌య‌త్నించినా ఆ క‌థ మ‌హేష్ కి సూట‌వుతుంద‌ని బ‌న్ని అన్నార‌ట‌. దాంతో ఆ దిశ‌గా ప‌ర‌శురామ్ – అల్లు అర‌వింద్ బృందం సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే మ‌హేష్ కి ప‌ర‌శురామ్ క‌థ వినిపిస్తార‌ని స‌మ‌చారం. మ‌రోవైపు మ‌హేష్ కి క‌థ వినిపించే వారి జాబితాలో అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే మ‌హేష్ ని ముందుగా ఎవ‌రు క‌థ చెప్పి ఓకే చేయించుకుంటారు? అన్న‌ది వేచి చూడాల్సిందే. సుకుమార్, ప‌ర‌వురామ్, సందీప్ వంగ ఈ ముగ్గురిని ఫ్రంట్ ర‌న్న‌ర్స్ గా భావించాల్సి ఉంటుంది ఇప్ప‌టికి.

User Comments