అదేంటి.. మహేష్ ఏం పాపం చేసాడు..? ఆయన ఏ దర్శకుడికి అన్యాయం చేయలేదే.. పైగా కథ నచ్చితే ట్రాక్ రికార్డ్ కూడా చూడడు కదా ఆయనపై ఎందుకు కసి అనుకుంటున్నారా..? అవును.. మహేష్ కు ఉన్న ఈ మంచి అలవాట్లే కొందరు దర్శకులతో జాతకం తిరగబడేలా చేసాయి. ఇప్పుడు సుకుమార్ నే తీసుకోండి. ఈయనకు ఆర్య తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదని తెలిసి కూడా ఈయన చెప్పిన కాంప్లికేటెడ్ కథను నమ్మి వన్ సినిమా చేసాడు సూపర్ స్టార్. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తనను అంత నమ్మిన మహేష్ కు ప్లాప్ ఇచ్చానని ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడు సుకుమార్. ఇదే విషయాన్ని రంగస్థలం ప్రమోషన్స్ లో కూడా చెబుతున్నాడు సుకుమార్.
అందుకే మహేష్ తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు సుకుమారుడు. ఈ సారి కన్ఫ్యూజన్స్ లేని కథను చెప్తానని చెప్పాడు సుకుమార్. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ దర్శకుడు.. మహేష్ బాకీ ఖచ్చితంగా తీరుస్తానంటున్నాడు. ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ బాకీ ఎప్పుడు తీర్చేద్దామా అని చూస్తున్నారు. ఈయన చేసిన అతడు జస్ట్ హిట్ అంతే.. ఇక ఖలేజా ఫ్లాప్. స్టార్ హీరోలందరికీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన త్రివిక్రమ్.. ఒక్క మహేష్ కు మాత్రమే బాకీ పడి పోయాడు. దాంతో ఎలాగైనా సూపర్ స్టార్ కు ఓ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. మొత్తానికి ఈయనకు హిట్ ఇవ్వాలని ఇటు సుకుమార్.. అటు త్రివిక్రమ్ కసి మీదున్నారు.