బోయ‌పాటికి ఐన్‌స్టీన్ అవార్డ్‌

Last Updated on by

మెగా- నంద‌మూరి అభిమానుల క్లాషెస్ గురించి తెలిసిందే. ఎన్‌బీకే క‌థానాయ‌కుడు రిలీజ్ ముందు మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫైరింగ్ ఇప్పుడు రామ్ చ‌రణ్ సినిమాకి ముప్పు తెచ్చింద‌ని అర్థ‌మ‌వుతోంది.ఈ సినిమాపై నంద‌మూరి ఫ్యాన్స్ సాగిస్తున్న ప్ర‌చారం ప‌రాకాష్ట‌లో ఉంది. బోయ‌పాటికి థాంక్స్ చెబుతూ, ఐన్ స్టీన్ అంత‌టివాడివి అంటూ యాంటీ ఫ్యాన్స్ చ‌ర‌ణ్ సినిమా డిజాస్ట‌ర్ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు.

ఓ యాంటీ ఫ్యాన్ `విన‌య విధేయ రామ` థియేట‌ర్‌లో వీడియోని మొబైల్ లో చిత్రీక‌రించి సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారానికి పెట్టాడు. ఇక వేరొక యాంటీ ఫ్యాన్ అయితే బోయ‌పాటిని ఐన్ స్టీన్ ఫోటోతో మిక్స్ చేసి .. యాక్ష‌న్ ని క‌నిపెట్టిన మ‌హానుభావుడు అనే అర్థంలో ట్వీట్ చేశాడు. ఇక యాంటీ ఫ్యాన్ షేర్ చేసిన వీడియోలో చ‌ర‌ణ్ అరివీర భ‌యంక‌ర‌మైన పోరాట దృశ్యం ఉంది. అందులో చ‌ర‌ణ్ వేసిన వేటుకు రెండు త‌ల‌కాయ‌లు గాల్లో లేచి విల‌న్ ఒబెరాయ్ పైనుంచి తారా జువ్వ‌ల్లా దూసుకుపోతున్నాయి. మొత్తానికి బోయ‌పాటి అస‌హ‌జ‌మైన సీన్ల‌కు ఫ్యాన్స్ గ‌గ్గోలు పెట్టేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. విన‌య విధేయ రామ కు జ‌నంలో మిశ్ర‌మ స్పంద‌న‌లు క‌నిపిస్తున్నాయి.

User Comments