బోయ‌పాటి దెబ్బ‌కు ఓట‌మి?

Last Updated on by

2004లో వైయ‌స్సార్ పాద్ర య‌త్ర చేప‌ట్టి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. నాడు తేదేపాకి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఎల‌క్ష‌న్ క్యాంపెయినింగ్ ప్ర‌చార చిత్రాల్ని రూపొందించారు. ఈసారి ఎన్నిక‌ల్లో మాత్రం తేదేపా కోసం ప్ర‌త్యేకించి మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్ నిర్వ‌హించే ప్ర‌క‌ట‌న‌లు రూపొందించిన సంగ‌తి తెలిసిందే. బోయ‌పాటి ఊర‌మాస్ టేకింగ్ కి ఊరూ వాడా తెగ న‌వ్వుకున్నారు. ఆయ‌న క్రియేటివిటీ ఇప్పుడు తేదేపాని ముంచింద‌న్న వాద‌న కూడా తెగ న‌వ్వు తెప్పించ‌కుండా ఉండ‌దు.
అప్ప‌ట్లో కె.రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌క‌ట‌న‌ల‌కు కాంపిటీష్ గా..  కాంగ్రెస్ ప్ర‌చార చిత్రాల్ని రూపొందించింది దివంగ‌త‌ హాస్య న‌టుడు ధ‌ర్మ‌వ‌రపు సుభ్ర‌హ్మ‌ణ్యం. `కుబుసం` చిత్రంలోని `ప‌ల్లే క‌న్నీరు బెడుతోందో.. పాట‌ని తీసుకుని చేసిన కాంగ్రెస్ ఎన్నిక‌ల ప్ర‌చార చిత్రానికి అనూహ్య స్పంద‌న ల‌భించింది. వైయ‌స్ ఛ‌రిష్మాకి ఆ పాట అద‌న‌పు అడ్వాంటేజ్ అయ్యి గెలుపు సాధ్యమైంది. చంద్ర‌బాబు ఓట‌మి కి ఆ పాట సాయ‌ప‌డింద‌ని పొగ‌డ్త‌లు వ‌చ్చాయి. 2019 ఏపీ ఎన్నిక‌ల్లోనూ తేదేపా కోసం బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌చార చిత్రాల్ని రూపొందిస్తే వైఎస్ జ‌గ‌న్ పార్టీ కోసం `రావాలి జ‌గ‌న్.. రావాలి జ‌గ‌న్ ` అంటూ సాగే పాట‌ని సుద్దాల అశోక్‌తేజ రాస్తే దాన్ని అంతే ప్ర‌భావ‌వంతంగా ఎన్. శంక‌ర్ చిత్రీక‌రించార‌ట‌. ఈ పాట జ‌నాల్లోకి బ‌లంగా వెళ్లింది. ఈ ఎన్నిక‌ల్లో వైయ‌స్ త‌ర‌హాలోనే వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌లు జ‌నాల‌కు క‌నెక్ట‌య్యాయి. అత‌డి ప్ర‌య‌త్నానికి సినిమా పాట క‌లిసొచ్చింది. అయితే ఈ రెండు సంద‌ర్భాల్ని ప‌రిశీలిస్తే.. అప్పుడు కె.రాఘ‌వేంద్రార‌వుని న‌మ్ముకుని ఓడిపోయిన చంద్ర‌బాబు ఇప్పుడు బోయ‌పాటిని న‌మ్మి నిండా మునిగార‌ని ఏపీ జ‌నాలు చెప్పుకుంటున్నారు. అయితే రాఘ‌వేంద్ర‌రావు వ‌ల్ల‌.. బోయ‌పాటి వ‌ల్ల పార్టీలు ఓడ‌తాయా?  యాడ్ క్యాంపెయినింగ్ స‌రిగా లేక‌పోయినా అత్యుత్సాహంగా ఉన్నా జ‌నం ప్ర‌భావితం అవుతారా? అంటే అంతా హంబ‌క్కే. ఓట‌రు నాడి ప‌ట్టుకోవ‌డం అంత వీజీ కాదు. సినిమా వోళ్ల‌ను చూసి.. సినిమా వోళ్ల‌ను న‌మ్మి ఓట్లు వేయ‌రు. రాఘ‌వేంద్ర‌రావు& బోయ‌పాటి భ‌జ‌న బృందం గురించి తెలుసుకోవాలంతే.