బాలయ్యకే ప్రిఫరెన్స్ ఇస్తున్న బోయపాటి..!

బోయపాటి శ్రీను దర్శకత్వం అంటే ఒక ప్రాధాన్యత ఉంటుంది.  ఖచ్చితంగా మాస్ కు నచ్చే అంశాలు.. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆయన సినిమాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తాయి.  సినిమా మినిమమ్ గ్యారెంటీ గా ఉంటుంది.  అందుకే బోయపాటి సినిమా అంటే హీరోలు కూడా డేట్స్ ఇస్తుంటారు.  పైగా రాజమౌళి లాగా సంవత్సరాల తరబడి షూటింగ్ చేయడు. ఇక ఇదిలా ఉంటే, బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమా ఈనెల 11 న విడుదల కాబోతుంది.  ఈ సినిమా తరువాత ఎవరితో సినిమా ఉంటుంది అనే దానిపై తాజాగా బోయపాటి పిచ్చ క్లారిటీ ఇచ్చాడు.  బాలకృష్ణతో బోయపాటి వందో సినిమా చేయాల్సి ఉంది.
కానీ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన సినిమా చేస్తుండటంతో ఆ అవకాశం కోల్పోయాడు. 101వ సినిమా పూరితో చేస్తున్నాడు. 102 కూడా ఇటీవలే కెఎస్ రవికుమార్ తో ఫిక్స్ అయింది.  ఇది ఈ ఏడాది చివరికి పూర్తవుతుంది.  ఆ తరువాత 103 వ చిత్రం బోయపాటితో ఉంటుందట.  దీనికి సంబంధించిన కథ కూడా ఇప్పటికే రెడీ అయినట్టు సమాచారం. ఇక బాలకృష్ణ తరువాత చిరంజీవితో సినిమా ఉంటుందని బోయపాటి చెప్పారు. దీంతో ఉయ్యాలవాడ సినిమా తరువాత బోయపాటి చిత్రంలో చిరు నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  ఈ సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా చేస్తాడట బోయపాటి.  ఈ మూడు తరువాతే మరే హీరోలతో సినిమా చేసినా అంటున్నాడు. అంతేకాకుండా బాలయ్యతో సినిమా మొదలయ్యే లోపు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. మరి బోయపాటి ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు ఎంతవరకు కరెక్ట్ గా ముందుకెళ్తుందో చూడాలి.