బోయ‌పాటి సినిమా అల్లు శీరిష్ తోనా?

Mythri Threatens Boyapati with Legal Action

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనుకి నిర్మాత‌ అల్లు అర‌వింద్ ఇప్పుడు దైవ స‌మానం. హీరోలు, నిర్మాత‌లు ముఖం చాటేస్తోన్న స‌మ‌యంలో అర‌వింద్ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు. మా బాల‌య్య అంటూ వెంట తిరిగిన బోయ‌పాటికి బాల‌య్య బొమ్మ చూపించాడు. బోయ‌పాటి ఉండాల్సిన స్థానంలో త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్ ర‌వికుమార్ ను తీసుకొచ్చి పెట్టాడు బాల‌య్య‌. కేవ‌లం ప్లాప్ లు కార‌ణంగానే బోయ‌పాటికి ఉద్వాస‌న త‌ప్ప‌లేదు. దీంతో బోయ‌పాటికి ఏం చేయాలో పాలుపోలేదు. అవ‌కాశం ఇవ్వండ‌ని హీరోల‌ను, నిర్మాత‌ల్ని అడ‌గ‌లేడు. అదే స‌మ‌యంలో అర‌వింద్ నిన్న‌టి రోజున బోయ‌పాటితో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి షాకిచ్చాడు.

గ‌తంలో `స‌రైనోడు` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ గీతా ఆర్స్ట్ కు ఇచ్చాడు కాబ‌ట్టే ఈ ఛాన్స్ అని అంతా అనుకున్నారు. మ‌ళ్లీ బ‌న్నీతోనే సినిమా ఉంటుంద‌ని ఊహాగానాలొస్తున్నాయి. కానీ అస‌లు విష‌యం అది కాద‌ని అర‌వింద్ స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తాజాగా తెలిసింది. ఈసారి ఛాన్స్ బ‌న్నీతో కాదు..అల్లు శీరీష్ తోనని లీకులందాయి. అవ‌కాశం కోసం ఎదురుచూస్తోన్న బోయ‌పాటి ఈ ఆఫ‌ర్ ను స్వీక‌రించాడ‌ని అంటున్నారు. గ‌తంలో బోయ‌పాటి మీడియం రేజ్ హీరోల‌తో సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకే ఈసారి శిరీష్ బాధ్య‌త‌ల్ని బోయ‌పాటి చేతుల్లో పెట్టిన‌ట్లు వినిపిస్తోంది. శిరీష్ ఇప్ప‌టివ‌ర‌కూ చిన్న స్థాయి ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేసాడు. హీరోగా ప్రూ చేసుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నాల‌న్ని బెడిసి కొట్టాయి. దీంతో కంటెంట్ సినిమాల‌పై ప‌డ్డాడు. అవి క‌లిసి రాలేదు. అందుకే అర‌వింద్ ఇక లాభం లేద‌ని ప్లాప్ సి ని అమ‌లు చేస్తున్న‌ట్లు ఉన్నాడు. బోయ‌పాటి కి హీరోని ఎలివేట్ చేయ‌డం కొట్టిన పిండి. హీరో ఇమేజ్ తో ప‌నిలేకుండా క్యారెక్ట‌ర్లు రాయిస్తాడు. అన్నీ స‌మ‌పాళ్ల‌లో కుదిరితే హిట్టే. లేక‌పోతే ప‌ట్టే అన్న‌ట్లు ఉంటుంది. జ‌య జానికి నాయ‌క క‌మ‌ర్శియ‌ల్ గా ఫెయిలైనా హీరో పాత్ర‌ను తెరపై చ‌క్క‌గా ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అలాంటి మ్యాజిక్ శిరీష్ విష‌యంలో రిపీట్ అవుతుందో చూడాలి.