ట్రైల‌ర్ టాక్: దుమ్మురేపిన‌ వార్

War Telugu Trailer

హృతిక్ రోష‌న్, టైగ‌ర్ ష్రాప్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. యాక్ష‌న్ యాక్ష‌న్ సినిమాల‌తో అద‌ర‌గొట్ట‌డం వీళ్ల ప్ర‌త్యేక‌త‌. ఒళ్లు గ‌గుర్పొడిచే యాక్ష‌న్ స‌న్నివేశాలు, సాహ‌స‌ విన్యాసాల‌తో  ఓ రేంజ్ లో అద‌ర‌గొడ‌తారు. అలాంటి స్టార్లు ఇద్ద‌రు ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తే యాక్ష‌న్ ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహ‌కే అంద‌దు. ప్ర‌స్తుతం హృతిక్ రోష‌న్, టైగ‌ర్ ష్రాప్ అభిమానులు ఆ కిక్ నే ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్ద‌రు క‌లిసి `వార్` సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బ్యాంగ్ బ్యాంగ్ ద‌ర్శ‌కుడు సిద్ధార్త్ ఆనంద్ ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

తాజాగా ఈసినిమా ట్రైల‌ర్ తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేసారు. యాక్ష‌న్ స‌న్నివేశాలు ప‌తాక స్థాయిలో ఉన్నాయి. హృతిక్, టైగ‌ర్ మ‌ద్య పోరాట స‌న్నివేశాలు అసాధార‌ణంగా ఉన్నాయి. ఇద్ద‌రు బాడీ బిల్టింగ్ స్పెష‌లిస్టులు కావ‌డంతో యాక్ష‌న్ పీక్స్ లో క‌నిపిస్తోంది. బైక్ , ర‌న్నింగ్ ఛేజింగ్ స‌న్నివేశాలు ఔరా అనిపిస్తున్నాయి. ఉత్కంఠ రేకెత్తించే కార్‌ ఛేజింగులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఈ ఒక్క ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. ఇందులో వాణి క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. యశ్‌రాజ్‌ ఫిలింస్ నిర్మిస్తోంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబ‌ర్ 2న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.