బ్ర‌హ్మానందం ఓటు ఎవ‌రికంటే?

Last Updated on by

ఈనెల 10 న `మా` ఎన్నిక‌లు జ‌రుగనున్న నేప‌థ్యంలో పోటీ దారులు శివాజీ రాజా, న‌రేష్ లు ఇప్ప‌టికే మ్యాని ఫెస్టోలు రిలీజ్ చేసి 800 మంది స‌భ్యుల‌ను ఎవ‌రికి వారు త‌మ వైపుకు తిప్పుకునే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే టాప్ స్టార్లు మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబుల‌ను క‌లిసి న‌రేష్ మ‌ద్ద‌త‌డ‌గం జ‌రిగింది. శివాజీ రాజా ప్యానల్ బృందం కూడా చిరు ను క‌లిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాజాగా శివాజీ రాజా టీమ్ కు హ్యస్య బ్ర‌హ్మ‌నందం స‌పోర్ట్ కూడా దొరికింది. బ్ర‌హ్మా బ‌హిరంగంగానే త‌న ఓటు శివాజీకే అంటూ ప్ర‌క‌టించారు. ఈ రోజు ఉద‌యం శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్, సురేష్ కొండేటి బ్ర‌హ్మానందంను ఆయ‌న ఇంటిలో క‌లిసారు.

ఈ సంద‌ర్భంగా బ్ర‌హ్మానందం మాట్లాడుతూ, ` పేద క‌ళాకారులు శివాజీ రాజా చేసిన మంచి ప‌నుల గురించి నా ద‌గ్గ‌ర చెప్పారు. వ్య‌క్తిగ‌తంగాను ఆయ‌న ఎంత నిబ‌ద్ద‌త‌గా ఉన్నాడో స్వ‌యంగా చూసాను. విన్నాను. త‌ను చేసిన మంచి పనులే శివాజీని గెలిపిస్తాయి. ఆయ‌న ప్యాన‌ల్ గెలుపు ఖాయ‌మ‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు. నా ఆశీర్వాదాలు శివాజీకి ఎప్పుడూ ఉంటాయ‌ని తెలిపారు. అయితే శివాజీ రాజా క‌లిసిన ప్ర‌తి స‌భ్యుడిని న‌రేష్ ప్యానల్ కూడా క‌లుస్తోంది. అక్క‌డ నుంచి కూడా పాజిటివ్ గానే రియాక్ష‌న్ వ‌స్తోంది. మ‌రి చివ‌రిగా `మా` పోరులో గెలిచేది ఎవ‌రో చూద్దాం.